Dharmapuri Srinivas : డీఎస్ మృతికి సంతాపం తెలిపిన మాజీ మంత్రులు హరీష్ , తలసాని
డీ శ్రీనివాస్ (D.Srinivas) మృతిపట్ల మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు
- Author : Sudheer
Date : 29-06-2024 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) గుండెపోటుతో ఈరోజు శనివారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఈరోజు తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. డీఎస్ మరణ వార్త తెలిసి రాజకీయ పార్టీ నేతలంతా తమ సంతాపం వ్యక్తం చేస్తూ..డీఎస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం డీఎస్ పార్థివ దేహాన్ని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహంలో ఉంచారు. ఈ క్రమంలో అన్ని పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలివస్తు నివాళ్లు అర్పిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
డీ శ్రీనివాస్ (D.Srinivas) మృతిపట్ల మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని హరీశ్ రావు అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్ మరణం బాధాకరమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని వెల్లడించారు. ఇక ఈరోజు సాయంత్రం భౌతిక కాయాన్ని నిజామాబాద్‌కు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.
Read Also : Prabhas Kalki : కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి.. బాస్..!