HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Jagtial Municipal Chairperson Boga Sravani Joins Bjp At Delhi

Boga Sravani: కమలం ఆకర్ష్.. బీజేపీలో చేరిన బోగ శ్రావణి!

బోగ శ్రావణి (Boga Sravani) బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన ఐదు రోజుల తర్వాత తన భర్త ప్రవీణ్‌తో కలిసి బీజేపీ లో చేరారు.

  • Author : Balu J Date : 02-03-2023 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp
Bjp

జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బోగ శ్రావణి (Boga Sravani) బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఐదు రోజుల తర్వాత తన భర్త ప్రవీణ్‌తో కలిసి బీజేపీ లో చేరారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. శ్రావణి వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, బీఆర్‌ఎస్‌ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇటీవల జగిత్యాలలో శ్రావణిని కలిసి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తనను చాలాసార్లు అవమానించారని, బీఆర్‌ఎస్ హైకమాండ్ తన ఫిర్యాదును పట్టించుకోలేదని, తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని శ్రావణి చెప్పారు.

ఒకవైపు బీఆర్ఎస్ (BRS Party) పార్టీ దేశ రాజకీయాలపై ఆసక్తి చూపుతూ.. పార్టీ విస్తరణపై ద్రుష్టి సారిస్తుంటే.. మరోవైపు ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ గ్రూప్ విభేదాలపై ఇతర పార్టీలు గురి పెడుతున్నాయి. బయటకొచ్చిన నేతలంతా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar) తో టచ్ లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అయిన ఈటల రాజేందర్ (Etala Rajendar) జగిత్యాలలోని శ్రావణి ఇంట్లో కలుసుకున్నారు.

శ్రావణి (Sravani)కి సంఘీభావం తెలిపి బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. అసెంబ్లీ పవిత్ర స్థలమని, బీఆర్‌ఎస్ డర్టీ పాలిటిక్స్ కు పాల్పడుతోందని రాజేందర్ అన్నారు. కేసీఆర్ హయాంలో వెనుకబడిన, ఎస్సీ వర్గాలకే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా అన్యాయం జరిగిందని ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ గొడవే అందుకు చక్కటి ఉదాహరణ అని అన్నారు. అధికార పార్టీ నాయకులు కేవలం సీఎంను పొగడడానికే ఉన్నారని, ప్రజా సమస్యలను వినే స్థితిలో లేరని రాజేందర్ (Etala Rajendar) అన్నారు.

Also Read: Sudheer Babu Look: సుధీర్ బాబు ఏంటీ.. ఇలా మారిపోయాడు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boga Sravani
  • brs party
  • Etala rajendar
  • Telangana BJP

Related News

Harish Rao

Harish Rao: కేసీఆర్ ఆఫీసు మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని, ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. “పట్టపగలే అధికార మదంతో కాంగ్రెస్ న

  • kalvakuntla Kavitha Party Name TRS

    Kalvakuntla Kavitha: టీఆర్ఎస్ పేరుపై కవిత కన్ను.

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd