Weather Today : తెలంగాణకు 5 రోజులు వర్షసూచన.. ఏపీలోని 9 జిల్లాల్లో భారీ వర్షాలు
Weather Today : ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
- By Pasha Published Date - 07:36 AM, Wed - 27 September 23

Weather Today : ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం ప్రభావంతో అక్టోబర్ 1 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. ఈరోజు సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also read : Gold- Silver Prices: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ధరలు..!
ఇవాళ ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, బాపట్ల , తూర్పుగోదావరి , గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు.. చిత్తూరు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, బాపట్ల, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని(Weather Today) చెప్పారు.