Accident : సూర్యాపేట హైవే పై ఘోర ప్రమాదం..నలుగురు మృతి
పండగవేళ విషాదం : చివ్వెంల మండలంలోని ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది
- By Sudheer Published Date - 08:50 AM, Fri - 10 January 25

సంక్రాంతి పండగవేళ విషాదం చోటుచేసుకుంది. సూర్యాపేట (Suryapet) జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. చివ్వెంల మండలంలోని ఐలాపురం (Ailapuram) వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వైపున వెళ్ళే ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మృతదేహాల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Warangal : హైదరాబాద్ కు ధీటుగా వరంగల్
ప్రమాదంలో మృతిచెందిన వారు ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా కూలీలుగా గుర్తించబడ్డారు. వారు పనుల కోసం హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ప్రమాదం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరిపేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.