HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Farmer Suicides In Maharashtra Are Bjps Virtue Minister Jupally

Minister Jupally: మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు బీజేపీ పుణ్యమే: మంత్రి జూప‌ల్లి

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నాయిగాం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి డా. మీన‌ల్ నిరంజ‌న్ పాటిల్ త‌ర‌పున మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు.

  • Author : Gopi Date : 18-11-2024 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Excise Minister
Excise Minister

Minister Jupally: దేశంలో రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా మహారాష్ట్రలోనే జరుగుతున్నా మహాయుతి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేద‌ని, మహారాష్ట్రలో మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సోయాబీన్, పత్తి రైతులకు సరైన ధర కల్పించేందుకు కృషి చేస్తుంద‌ని తెలంగాణ‌ ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి (Minister Jupally) కృష్ణారావు అన్నారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు బీజేపీ పుణ్యమేన‌ని ఆయ‌న ఆరోపించారు. ఎంవీఏ కూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ త‌ర‌హాలో గ్యారంటీల‌ను మ‌హారాష్ట్ర‌లో అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నాయిగాం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి డా. మీన‌ల్ నిరంజ‌న్ పాటిల్ త‌ర‌పున మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఓట‌ర్ల‌కు వివ‌రించారు. మ‌హా వికాస్ అఘాడీ అధికారంలోకి రాగానే తెలంగాణ త‌ర‌హాలో గ్యారంటీల‌ను అమ‌లు చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో మీన‌ల్ ను గెలిపించాల‌ని కోరారు. అదీవాసీలు, ద‌ళితులు, పేద‌ల‌కు న్యాయం జ‌ర‌గాలంటే కాంగ్రెస్ కూట‌మి అభ్యర్థుల‌ను గెలిపించాల‌న్నారు.

Also Read: Rajoana mercy plea : బల్వంత్ సింగ్‌కు క్షమాభిక్ష..రాష్ట్రపతి నిర్ణయాన్ని కోరిన సుప్రీంకోర్టు

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ కూట‌మి అవ‌లంబిస్తున్న విధానాల వ‌ల్ల దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్యహత్యలు చేసుకుంటున్నారని, నీటి కొరత, పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం, ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా చితికిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల‌ను నిల‌బెట్టుకుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. అలాగే రైతుల సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని వివ‌రించారు. మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ కూట‌మి అభ్య‌ర్థులను గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు వివ‌రించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assembly Election 2024
  • Congress Kutami
  • Maharashtra
  • Maharashtra Assembly Election 2024
  • Minister Jupally Krishnarao
  • politics
  • rahul gandhi

Related News

Aiadmk Eyes Tvk Alliance

Vijay TVK: విజయ్‎తో టచ్‎లో 10 మంది ఎమ్మెల్యేలు..!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)కు అన్నాడీఎంకే బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహిస్తు

  • Support from Congress for TVK Vijay

    TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!

Latest News

  • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

  • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

  • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd