Bigg Boss 7 Telugu: ‘బిగ్’ రగడ.. అమర్దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి
Bigg Boss 7 Telugu: ‘బిగ్‌బాస్ సీజన్ 7’ టైటిల్ గెలిచి పల్లవి ప్రశాంత్ పెద్ద స్టార్ అయ్యాడు.
- By Pasha Published Date - 09:57 AM, Mon - 18 December 23
Bigg Boss 7 Telugu: ‘బిగ్‌బాస్ సీజన్ 7’ టైటిల్ గెలిచి పల్లవి ప్రశాంత్ పెద్ద స్టార్ అయ్యాడు. రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ నిలిచాడు. విన్నర్‌ను ప్రకటించిన అనంతరం అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. బిగ్‌బాస్ 7 షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు ఆదివారం పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు వచ్చారు. ప్రశాంత్ విజేతగా నిలవగానే ఆయన ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య చిన్న గొడవ మొదలైంది. అది కాస్తా పెరిగి.. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ.. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు (కొండాపూర్-సికింద్రాబాద్)పై దాడి చేసి.. అద్దాన్ని పగలగొట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఆదివారం అర్థరాత్రి అన్నపూర్ణా స్టూడియోస్ నుంచి అమర్దీప్ బయటకు వస్తున్నాడని తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్(Bigg Boss 7 Telugu) కొందరు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. కారు అద్దాలు పగలగొట్టి అమర్‌దీప్‌ను బయటకు దిగమంటూ గొడవ చేశారు. దాదాపు అరగంట పాటు కారుపై దాడికి దిగారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య, స్నేహితుడు భయభ్రాంతులకు గురయ్యారు. మమ్మల్ని వదిలేయండని అమర్ తల్లి, స్నేహితుడు చేతులు జోడించి వేడుకున్నా వారు వినిపించుకోలేదు. కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడిలో అమర్దీప్ సహా అతని తల్లి, భార్యకు గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రశాంత్‌ని అమర్ తక్కువ చేసి మాట్లాడటమే ఈ గొడవకు కారణమని అంటున్నారు.
Also Read: Bigg Boss 7 : పల్లవి ప్రశాంత్ గెలుపు బాటలు వేసింది అమరే.. ఎలాగో తెలుసా..?
సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అమర్దీప్ కారుపై దాడి జరిగిన కాసేపటికే స్టూడియో నుంచి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్వినిశ్రీ, పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దుండగులు దాడి చేశారు. దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అమర్దీప్ కారుపై దాడికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమర్, ప్రశాంత్ అభిమానుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి