HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Exclusive Story On Telangana Dashabdi Utsavalu

Dashabdi Utsavalu: తెలంగాణ ‘దశాబ్ది’ ఉత్సవాలు దద్దరిల్లేలా!

తెలంగాణ ​రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అన్నీ పార్టీలు జయహో తెలంగాణ అని నినదిస్తున్నాయి.

  • Author : Balu J Date : 01-06-2023 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Formantion Day New
Formantion Day New

ఉద్యమాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ కొన్ని ఉద్యమాలు మాత్రమే చరిత్ర (History) గతిని మార్చేస్తాయి. ప్రపంచాన్ని సైతం కదిలిస్తాయి. ప్రత్యేక పోరులో మేము సైతం అనిపించేలా  జనాలను ఉసిగొల్పుతాయి. జైలుపాలు చేసినా.. బుల్లెట్ల వర్షం కురిపించినా తగ్గేదేలే అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిధ్వనింపజేస్తాయి. ’దుమ్ము పట్టిపోతున్న నేను సంచలన వార్తను అవుతాను’ అంటాడో ఓ కవి.  2014 కు ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని ఏ బిడ్డ కలగనలేదు. ఏ సమైక్యా నాయకుడూ ఊహించి ఉండడు. కానీ సకల జనులు ఏకమైనా వేళ.. విద్యార్థి సంఘాలు కదంతొక్కినా సమయానా, శ్రామిక సంఘాలు ఆందోళన బాట పట్టిన వేళా.. ఢిల్లీ పీఠాలు కదిలి ఓ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఓ చిన్న రాష్ట్రంగా పురుడుపోసుకున్న తెలంగాణ (Telangana) ఇంతింతై వ‌టుడింతై అన్నట్టుగా అభివృద్ధిలో దూసుకుపోయి దేశానికే తలమానికంగా నిలిచింది. విద్య, వైద్య, వ్యవసాయ అన్ని రంగాల్లో ఊహించని విధంగా దూసుకుపోతోంది. తెలంగాణ ​రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ   పార్టీలన్నీ జయహో తెలంగాణ అని నినదిస్తున్నాయి. ఈ సందర్భంగా హ్యాష్ ట్యాగ్ యూ (HashtagU) ప్రత్యేక కథనం

 105 కోట్ల రూపాయల నిధులతో

పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరు ల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం (CM KCR) ఇటీవలే ఆదేశించారు. గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని వివరించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో  వాటి నిర్వహణ గురించి సీఎం సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

మీరా కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న హైదరాబాద్ (Hyderabad)లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ వేడుకలు నిర్వహించనుంది. ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ (Meira Kumar) పాల్గొననున్నారు. యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చిన సమయంలో మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రను మీరా కుమార్ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర అబిడ్స్ నెహ్రూ విగ్రహం మీదుగా గాంధీభవన్ కు చేరుకుంటుంది. అనంతరం గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖులను సన్మానిస్తారు.

గోల్కొండ కోటలో బీజేపీ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ (TBJP) కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గోల్కొండ కోటలో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. కేంద్రం ప్రభుత్వ తరపున ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలను జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించిందని, ఈ మేరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాధనలో 1200 మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. గోల్కొండ కోటలో జరగనున్న ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరిని ఆహ్వానిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రాజ్ భవన్ లలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతామని స్పష్టం చేశారు.

కేసీఆర్ కు షర్మిల (Sharmila) పది ప్రశ్నలు

  1. రాష్ట్రాన్ని 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి ఎందుకు నెట్టవలసి వచ్చింది?
  2. రాష్ట్రాన్ని పణంగా పెట్టి ఈ పదేళ్లలో ఎంత సంపదను కూడబెట్టారు?
  3. వాగ్దానం చేసినట్లు మీరు దళితుడిని రాష్ట్రానికి ఎందుకు సీఎం చేయలేదు?
  4. మీరు 10 మిలియన్ ఎకరాల భూమికి ఎందుకు సాగునీరు అందించలేదు?
  5. మీరు రైతులకు రుణమాఫీని ఎందుకు పొడిగించలేదు?
  6. వాగ్దానం చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ ఉన్నాయి?
  7. తెలంగాణ అమరవీరులకు వాగ్దానం చేసిన ఆర్థిక సహాయం ఎక్కడ ఉంది?
  8. పోడు భూములను గిరిజనులకు పంపిణీ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు?
  9. నిరుద్యోగులకు వాగ్దానం చేసిన ఉద్యోగాలు మరియు పెన్షన్లు ఎక్కడ ఉన్నాయి?
  10. తొమ్మిదేళ్లు గడిచినా మీరు కేజీ టు పీజీ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు?

ముందున్న సవాళ్లు

  • నేడు తెలంగాణాలో పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్య పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది.
  • తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో వెలుగులోకి తీసుకొచ్చింది విద్యా పరిరక్షణ సమితి.
  • రాష్ట్రంలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చినప్పటికీ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది.
  • మానవ వనరుల అభివృద్ధికి అవసరమైన విద్య, వైద్యం వంటి ప్రాథమిక అంశాలను పక్కనపెట్టి, జనాకర్షక పథాకలకు పెద్దపీట వేశారు. ఆ హోరులో బంగారు తెలంగాణ వాగ్దానం దాదాపు కొట్టుకుపోయిందనే చెప్పాలి.
  • వనరుల కొరత వలన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. వైస్-ఛాన్సలర్ల నియామకం ఆలస్యం కారణంగా నాయకత్వ లోపించడం, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోవడం మొదలైనవి ప్రభుత్వం హ్రస్వదృష్టికి నిదర్శనాలు.
  • మరోవైపు, ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించడం అనేది ప్రభుత్వ విధానాలు ప్రజా ప్రయోజనాలకు ఎంత దూరంగా ఉన్నాయో తెలియజేస్తుంది.
  • నిరుద్యోగ సమస్య పరిష్కారానికి టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమవడంతో పాటు విద్యాసంస్థల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత, మధ్యతరగతి, కొన్ని వర్గాల ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వ పాలన పట్ల విరక్తి ఏర్పడిందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి.
  • గ్రామీణ ప్రాంతాల నుంచి, అణగారిన వర్గాల నుంచి పై స్థాయి చదువుల కోసం యూనివర్సిటీలకు వస్తున్న విద్యార్థులకు అక్కడి పరిస్థితులు, పరిపాలన నిర్లక్ష్యం వారి ఆకాంక్షలకు అవరోధాాలుగా నిలుస్తున్నాయి.

Also Read: Wife Killed: శృంగారం వద్దన్నందుకు భార్యను చంపిన భర్త!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • all parties
  • cm kcr
  • Dashabdi Utsavalu
  • telangana

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • LPG Price Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

  • Rains: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం

  • Donald Trump: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : సీఎం రేవంత్ రెడ్డి

  • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd