Drugs : మొయినాబాద్ ఫామ్ హౌస్ లో భారీగా దొరికిన డ్రగ్స్..సినిమా ప్రముఖులకు కొత్త చిక్కు
Drugs : గతంలో కూడా టాలీవుడ్‌లో పలుమార్లు డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంతమంది డ్రగ్స్ డీలర్లు పట్టుబడటంతో, వారు ఎవరెవరి పేర్లు బయటపెడతారన్నది ఆసక్తికరంగా మారింది
- By Sudheer Published Date - 12:23 PM, Sat - 16 August 25

రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌లోని బకారాలో ఒక ఫామ్‌హౌస్‌పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి, మాదకద్రవ్యాల (Drugs ) పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీలో ఉగాండా, నైజీరియాకు చెందినవారు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. మొత్తం 51 మందిని అరెస్టు చేయగా, వారిలో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. వీరంతా విదేశీ డ్రగ్ పెడలర్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ పరీక్షలు చేయగా చాలామందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ పార్టీని ఉగాండాకు చెందిన మమస్ అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో భారీగా మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
B2 Bombers: పుతిన్‌పై నుంచి దూసుకెళ్లిన బీ-2 బాంబర్లు.. భేటీ సమయంలో ట్రంప్ ‘పవర్ ప్లే’
అరెస్టు చేసినవారి పాస్‌పోర్టులు, వీసాలు పరిశీలించగా, చాలామంది వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు 65 బీర్ బాటిళ్లు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ పార్టీకి ఎక్సైజ్ అనుమతి కూడా లేదని తేలింది. పట్టుబడిన వారిలో 12 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని సమాచారం.
ఈ సంఘటనతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్న సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది. గతంలో కూడా టాలీవుడ్‌లో పలుమార్లు డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంతమంది డ్రగ్స్ డీలర్లు పట్టుబడటంతో, వారు ఎవరెవరి పేర్లు బయటపెడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ డ్రగ్స్ గ్యాంగ్‌కు టాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.