Anjith Rao : నోట్లకట్టలతో పట్టుబడిన ఎక్సైజ్ సీఐ అంజిత్ రావుపై వేటు
ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు దాదాపు 6 లక్షలకు పైగా సొమ్ముతో వరంగల్ నుంచి కారులో బయలుదేరాడు
- By Sudheer Published Date - 12:33 PM, Wed - 29 November 23

ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేపట్టి..అక్రమంగా డబ్బు తరలిస్తున్న వారిని పట్టుకోవాలి..కానీ ఇక్కడ ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు మాత్రం నేరుగా ఆయనే డబ్బు తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారని..వారే అధికార పార్టీ నేతలకు సంబదించిన డబ్బును తరలించారని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 27 సోమవారం నాడు ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు దాదాపు 6 లక్షలకు పైగా సొమ్ముతో వరంగల్ నుంచి కారులో బయలుదేరాడు. మేడ్చల్ కు వెళుతుండగా చెంగిచెర్ల సమీపంలో ఆయన కారును కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కారులో తనిఖీ చేయగా ఓ సంచీలో నోట్లకట్టలు బయటపడ్డాయి. అందులో అంజిత్ రావు ఐడీ కార్డు కూడా ఉంది. దీంతో సీఐ అంజిత్ ను కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. పోలీసులు అంజిత్ కారును, నోట్ల కట్టలను సీజ్ చేశారు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన ఎక్సైజ్ శాఖ.. సీఐ అంజిత్ రావును (Anjith Rao) విధుల నుంచి తప్పించింది. హెడ్ క్వార్టర్స్‌లో ఉండాల్సిన అంజిత్ రావు (Anjith Rao).. ఎందుకు బయటకు వెళ్లాడని అడిగింది. ఎమర్జెన్సీ అయితే పర్మిషన్ తీసుకొని వెళ్లాలి.. అలా చేయకపోవడంతో సస్పెండ్ చేస్తున్నామని పేర్కొంది.
Read Also : Telangana Elections 2023 : కిటకిటలాడుతోన్న బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు