HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ex Minister Singireddy Fire On Prime Minister Modi

Singireddy: దేశమా వర్ధిల్లు.. ప్రధాని మోడీపై మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్!

  • Author : Balu J Date : 31-05-2024 - 9:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Niranjan Reddy
Niranjan Reddy

Singireddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రధాని మోడీపై మండిపడ్డారు. 1982లో గాంధీ సినిమా వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్  (జననం 1879 మార్చి 14 – మరణం1955 ఏప్రిల్ 18 ) ఒక సంధర్భంలో మహాత్మాగాంధీ గారి గురించి ప్రస్తావిస్తూ ‘‘కొన్నేండ్ల తర్వాత భావితరాలు .. ఈ నేల మీద రక్తమాంసాలు కలిగిన మహాత్మాగాంధీ లాంటి ఒక మనిషి నడయాడిండు అంటే నమ్మశక్యం కాకుండా ఉంటుందేమో’ అని మహాత్మాగాంధీకి ఉన్న అసాధారణ గొప్ప లక్షణాల గురించి చెప్పాడు.

భారత స్వాతంత్య్రం అనంతరం నాటి బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ (జననం 30 నవంబర్ 1874 – మరణం 24 జనవరి 1965)  ‘‘తమ రెండో ప్రపంచయుద్దంలో బ్రిటన్ పాత్ర. జరిగిన లాభనష్టాలు. వారి సామ్రాజ్యవాద పరిపాలన’’ తదితర అంశాల మీద బ్రిటన్ క్యాబినెట్ చర్చిస్తున్న సంధర్భంలో ‘‘అహింసావాదం అనేది, సత్యాగ్రహం అనేది, సహాయనిరాకణ అనేది. మహాత్మాగాంధీ కొత్తగా పరిచయం చేసిన ఈ  పోరాట రూపాలను, సిద్దాంతాన్ని మేము చులకనగా చూశాం. తక్కువ అంచనా వేశాం. ఈ సిద్దాంతం వెనక, ఈ ప్రక్రియలకు ఇంత గొప్ప ప్రజాశక్తి ఉందని గ్రహించి ఉంటే, మాకు అర్దం అయి ఉంటే.. మేమే మహాత్ముడిని భౌతికంగా నిర్మూలించే వాళ్లం‘‘ అని చర్చిల్ అన్నారు.

ఐన్ స్టీన్ మాటలు, విన్ స్టన్ చర్చిల్ మాటలు చరిత్ర రికార్డులలో ఉన్న విషయం ప్రపంచానికి తెలుసు. ప్రపంచ పోరాటాల యొక్క గమనాలను, గమ్యాలను ప్రభావితం చేసిన వ్యక్తి మహాత్మాగాంధీ. భారత స్వాతంత్య్రం అనంతరం ప్రపంచంలోని అనేక దేశాలలో జరిగిన మార్పులకు రక్తపాతం బదులు గాంధీ సిద్దాంతమే సరైనదని చాలా  దేశాలు, దేశాధినేతలు పలు సంధర్భాలలో ప్రకటించారు.

దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులకు వ్యతిరేకంగా సాగిన సుధీర్ఘ నల్లజాతీయుల పోరాటంలో తొలితరం పోరాటం అంతా హింసాయుతమే. కానీ 27 ఏళ్లు సుధీర్ఘ కారాగార జీవితం అనుభవించిన నెల్సన్ మండేలా (జననం జూలై 18, 1918, – మరణం డిసెంబర్ 5, 2013) స్వయంగా ప్రకటించింది ‘‘మేము హింసను వీడి మహాత్మాగాంధీ మార్గం అనుసరించాం కాబట్టి దక్షిణాఫ్రికాకు స్వాతంత్య్రం సముపార్జించాం. ఆయనే మాకు మార్గదర్శి’’ అని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hard comments
  • pm modi
  • Singireddy

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd