No Power : నేటి నుంచి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమ్మె..!!
రేపు తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు.
- By hashtagu Published Date - 07:07 PM, Sun - 7 August 22

రేపు తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఎవరూ కూడా విధులకు హాజరుకారని విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు. దీంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమే అంటున్నారు విద్యుత్ ఉద్యోగులు.