Rythu Bandhu : కేసీఆర్ కు షాక్..రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసిన ఈసీ
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధుల విడుదల ఎలా చేస్తారని ప్రతిపక్ష పార్టీలు పిర్యాదులు చేయడంతో ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది
- Author : Sudheer
Date : 27-11-2023 - 9:43 IST
Published By : Hashtagu Telugu Desk
చివరి నిమిషంలో రైతుబంధు (Rythu Bandhu) నిధుల విడుదలకు బ్రేక్ వేసింది ఈసీ (EC). రెండు రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో రేపు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలనీ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు ఆ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధుల విడుదల ఎలా చేస్తారని ప్రతిపక్ష పార్టీలు పిర్యాదులు చేయడంతో ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రబీ సీజన్‌కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేకపోయింది. అయితే, ప్రభుత్వం రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి కోరగా.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. తాజాగా.. ఈసీ అనుమతిపై విపక్షాలు తీవ్రంగా రియాక్ట్ కావడంతో పాటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశాయి. దీంతో రైతుబంధు పంపిణీపై ఈసీ యూటర్న్ తీసుకుంది.
ఈ నిర్ణయం కేసీఆర్ (KCR) కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సరిగ్గా రెండు రోజుల్లో పోలింగ్ ఉన్న సమయంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు విడుదల చేస్తే..మేలు జరుగుతుందని..ఓటర్లు తమ పార్టీకి ఓటు వేసే ఛాన్స్ ఉందని భావించింది. కానీ ఇప్పుడు ఈసీ నిర్ణయం తో షాక్ కు గురైందని చెప్పాలి.
Read Also : PM Modi : శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ