Eggs Attack : బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు ఫై కోడిగుడ్లతో దాడి
- By Sudheer Published Date - 08:33 PM, Tue - 13 February 24

కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో బిఆర్ఎస్ భారీ సభ (BRS Meeting In Nalgonda ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు బిఆర్ఎస్ ఎంపీలు , ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీ లు ఇలా అంత కూడా హైదరాబాద్ (Hyderabad) నుండి ప్రత్యేక బస్సు లో వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో నేతలకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాదు రోడ్డులో ఉన్న హోటల్ మనోరామ వద్దకు భారీగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని..బస్సు ను అడ్డుకున్నారు. కొంతమంది కోడిగుడ్ల తో దాడి చేసారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. బస్సులపై కోడిగుడ్లు (Eggs Attack) విసిరారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు… కాంగ్రెస్ కార్యకర్తలను చదరగొట్టి రూట్ క్లియర్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రయాణించే బస్సు దారిపొడుగున కేసీఆర్ కు వ్యతిరేక కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె నల్గొండ సభలో కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇదని కేసీఆర్ అన్నారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదని 24 ఏళ్లుగా పక్షిలాగ తిరగుతూ రాష్ట్రం మొత్తం చెప్పానని తెలిపారు. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయని, బాధితులను దిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాకే నల్గొండలో ఫ్లోరైడ్ (Nalgonda Fluoride Issue) సమస్య పోయిందని వెల్లడించారు. ఇప్పుడు నల్గొండ జిల్లా పూర్తిగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారిందని వివరించారు. ‘మళ్లీ మనమే వస్తాం.. అనుకున్నవి చేస్తాం’ ..కరెంటు కోసం ఎక్కడికక్కడ నిలదీయాలని, చలో నల్గొండతోనే ఆపమని రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎక్కడికక్కడ నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం బాధ్యత తమకు ఇచ్చారన్న కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారు తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also : KCR : కేసీఆర్ నువ్వు సత్యహరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి వచ్చి నిజాలు చెప్పు – రేవంత్