HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >E Mining Mobile App To Prevent Irregularities Minister Mahender Reddy

E-mining App: అక్రమాల నివారణకు ఈ-మైనింగ్ మొబైల్ యాప్: మంత్రి మహేందర్ రెడ్డి

ఈ మైనింగ్ మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు వెంటనే తీసుకోవడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుంది.

  • Author : Balu J Date : 30-09-2023 - 2:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
E Mining
E Mining

గనులు భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ మైనింగ్ మొబైల్ యాప్ దోహదం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో సిఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డీఎం జి పి. కాత్యాయని దేవి లతో కలిసి తెలంగాణ ఈ – మైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు హైదరాబాద్ లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసి) సంయుక్తంగా ఈ మొబైల్ యాప్ను అభివృద్ధి పరిచినట్లు చెప్పారు.

ఈ మైనింగ్ ఆప్ తో గనులు, ఇటుక, ఇసుక రవాణా జరిగినప్పుడు రవాణా వాహనాలను తనిఖీ చేసి ట్రాన్సిస్ట్ ఫామ్, ట్రాన్సిస్టర్ అనుమతులు ఉన్నాయా లేవా అని అంశాలను ఆన్లైన్లో వెంటనే సిబ్బంది తెలుసుకోవచ్చని తెలిపారు. అక్రమ రవాణా, అనుమతులు లేకుండా కానీ, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో రవాణాకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకొని, పెనాల్టీ విధించి ఆ సమాచారాన్ని వాహన యజమానికి ఆన్లైన్ పద్ధతిలో లింక్ ద్వారా పంపించి వెంటనే పెనాల్టీ వసూలు చేసేందుకు సిబ్బందికి, అలాగే చెల్లించేందుకు వాహన యజమానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు. డీలర్లు మరియు లీజు హోల్డర్లు ఖనిజ రవాణాలో ఆన్లైన్ ద్వారా తమ రవాణా చేసుకునేందుకు శాఖా పరమైన అనుమతుల నిర్ధారణ సైతం తెలుసుకోవచ్చని అన్నారు.

అలాగే తనిఖీలు నిర్వహించే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్ జువాలజిస్టులు, టెక్నీషియన్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లకు వాహనాల తనిఖీ చాలా సులభం అవుతుందని వెల్లడించారు. ఈ మైనింగ్ మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు వెంటనే తీసుకోవడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుందని చెప్పారు. ఇసుకతో పాటు ఇటుక, ఖనిజాల అక్రమ రవాణాలో పారదర్శకతకు ఎంతో తోడ్పడుతుందని, దేశంలోనే ఎక్కడలేని విధంగా అభివృద్ధిపరిచే దశలో ఉందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • E-mining App
  • hyderabad
  • Patnam Mahender Reddy

Related News

Murder Sketch On Second Wif

Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

నిందితుడు అరుణ్ కుమార్‌కు మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బు మరియు యాకుత్‌పురకు చెందిన మీర్ ముజమ్మిల్ సహకరించారు. ముఖ్యంగా ముజమ్మిల్ అక్రమ ఆయుధాలకు నిలయమైన బీహార్‌లోని ముంగేర్ ప్రాంతానికి

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

Latest News

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd