Driving License: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలా..? మొబైల్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదే.
లైసెన్స్ రెన్యూవల్ గడువు వచ్చిన వెంటనే ఇంట్లో నుంచే మొబైల్ లో రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- By News Desk Published Date - 08:40 PM, Mon - 21 April 25

Driving License: ఏ వాహనం నడపాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుపై వాహనాలు నడిపేవారికి పోలీసులు ఫైన్లు విధిస్తుంటారు. అయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు వయసు ఆధారంగా కొన్నేళ్ల గడువుతో రవాణాశాఖ అధికారులు లెసెన్సులు జారీ చేస్తారు. ఈ గడువు ముగిసేలోగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది పనిబిజీలో పడి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ను అశ్రద్ధ చేస్తుంటారు.
Also Read: Gold Price: రూ. లక్ష చేరిన బంగారం ధరలు.. కారణమిదే?
సాధారణంగా లైసెన్స్ గడువు ముగిసిన 30 రోజుల్లో (గ్రేస్ పీరియడ్) రెన్యువల్ చేసుకోకుంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. చాలాకాలం అలానే ఉంటే.. ఫైన్‌తో పాటు మళ్లీ కొత్త డ్రైవింగ్ లైసెన్సు కోసం అఫ్లయ్ చేసుకోవాలి. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి కొత్త లైసెన్స్ మాదిరిగా మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read: Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ సంపద ఎంతో తెలుసా..?
లైసెన్స్ రెన్యూవల్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లే సమయం లేక చాలా మంది ఫైన్లు కట్టి డ్రైవింగ్ లైసెన్సులను రెన్యూవల్ చేసుకుంటున్న పరిస్థితి. అలాంటి వారికోసం ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. లైసెన్స్ రెన్యూవల్ గడువు వచ్చిన వెంటనే ఇంట్లో నుంచే మొబైల్ లో రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రాసెస్ ఇదే..
◊ రవాణాశాఖ వెబ్‌సైట్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌పై క్లిక్ చేయాలి.
◊ పేజీ లోడ్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి.
◊ అనంతరం రెన్యువల్ ఆఫ్ లైసెన్స్‌ను ఎంచుకుని జీవోపై క్లిక్ చేయాలి.
◊ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, జారీ చేసిన ఆర్టీఏ కార్యాలయం, పుట్టిన తేదీ, సెల్‌ఫోన్ నంబర్‌తోపాటు క్యాప్చా వివరాలను పొందుపర్చాలి.
◊ రిక్వెస్ట్ ఓటీపీపై నొకితే మీ సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేశాక గెట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేస్తే వివరాలు కనిపిస్తాయి. వాటిని పరిశీలించాక కన్ఫామ్‌పై క్లిక్ చేసి, సేవ్ నొకితే మీ వివరాలు సేవ్ అవుతాయి.
◊ తదుపరి విండోలో స్లాట్ కోసం మనకు నచ్చిన తేదీ, సమయాలను ఎంచుకుని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
◊ ఇప్పుడు చెల్లించాల్సిన రుసుమును పరిశీలించి పేనౌపై క్లిక్ చేయాలి. అనంతరం అనువైన ఆప్షన్‌కు డబ్బు చెల్లిస్తే స్లాట్ బుక్ అవుతుంది. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వస్తుంది. వాటిని ప్రింట్ తీసుకోవాలి.
◊ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌పై వైద్యాధికారితో సంతకం చేయించి, ఆధార్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను స్లాట్ బుక్ అయిన రోజున ఆర్టీఏ కార్యాలయంలో అందజేస్తే కొద్ది రోజుల్లోనే రెన్యూవల్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.