Drive-in Theatre: మూవీస్ థ్రిల్లింగ్స్.. హైదరాబాద్ లో డ్రైన్ ఇన్ థియేటర్స్!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో డ్రైవ్-ఇన్ థియేటర్ (Drive-in Theatre) అందుబాటులోకి రానుంది.
- By Balu J Published Date - 01:39 PM, Wed - 8 February 23

హైదరాబాద్ (Hyderabad) విశ్వనగరం దిశగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే మెట్రో, డబుల్ డెక్కర్, ఈ రేస్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్ బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంటోంది. ఎన్నో ఐటీ కంపెనీలు, ఫ్లై ఓవర్లు, ఐటీ కారిడర్ తో దూసుకుపోతున్న భాగ్యనగరం ఎంటర్ టైన్ మెంట్ రంగంలోనూ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో మొదటి ఎయిర్‌పోర్ట్ డ్రైవ్-ఇన్ థియేటర్ (Drive-in Theatre) అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఆక్వా గోల్ఫ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు కానుంది. డ్రైవ్-ఇన్ థియేటర్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ముందు భాగంలో ఏర్పాటు కానుంది. వందల సంఖ్యలో ప్రేక్షకులు చూసేలా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయబడుతుంది. కార్లలోనే ఉంటూ ఇష్టమైన సినిమాను చూడొచ్చు.
డ్రైవ్ ఇన్ థియేటర్స్ (Drive-in Theatre) కోసం సుమారు రూ.5 నుంచి 8 కోట్ల వరకు ఖర్చు కానున్నట్టు తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇలాంటి థియేటర్స్ జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ధియేటర్స్ అందుబాటులోకి తెస్తే ఎవరి కార్లో వారు కూర్చొని ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూడొచ్చు. ఈ తరహా ఎంటర్ టైన్ మెంట్ ఏపీలో కూడా ప్రతిపాదించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ హైదరాబాద్ లో డ్రైవ్ ఇన్ థియేటర్స్ (Drive-in Theatre) అందుబాటులోకి వస్తే జనాలకు మరో అతిపెద్ద ఎంటర్ టైన్ మెంట్ దొరికే అవకాశాలున్నాయి.
ఓపెన్ థియేటర్స్
హైదరాబాద్ ప్రజలకు ఓపెన్ థియేటర్స్ అనుభవం ఉంది. గతంలో శంషాబాద్ (Shamshabad) దగ్గర నోవాటెల్ హోటల్ ఓపెన్ ఏరియాలో బిగ్ స్క్రీన్‌పై సర్దార్ మూవీని ప్రదర్శించింది ఆహా (Aha) టీమ్. మైదానంలో ప్రదర్శించిన సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దఎత్తున వచ్చారు. ఛిల్ విత్ ఫ్రైడే స్ప్రైట్ కాన్సెప్ట్ చాలా బాగుందంటున్నారు ప్రేక్షకులు. ఇష్టమైన వాళ్లతో కలిసి ఓపెన్ ఏరియాలో పెద్ద స్క్రీన్‌పై సినిమా చూడటం థ్రిల్లింగ్ ఉందన్నారు.
Also Read: SSMB 28 Update: మహేష్ బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు.. శరవేగంగా SSMB 28 షూటింగ్!

Related News

TSPSC: మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ.. జూన్ 17కు మార్పు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను TSPSC వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.