Mahesh Kumar : గాంధీ భవన్ లో రేపటి నుండి జిల్లాల సమీక్ష సమావేశాలు
Mahesh Kumar : గాంధీ భవన్ లో రేపటి నుండి జిల్లాల సమీక్ష సమావేశాలు
- By Sudheer Published Date - 12:32 PM, Fri - 20 September 24

Gandhi Bhavan : టీపీసీసీ (TPCC) గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)..అధిష్టానం ఇచ్చిన పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా పార్టీ విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. TPCC గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రులు ప్రతి వారంలో రెండుసార్లు గాంధీ భవన్ రావాలని సూచించారు. ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్క మంత్రి గాంధీ భవన్ (Gandhi Bhavan) కు రావాలని ఆదేశించారు.
ఇక మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంబించారు. రేపటి నుంచి జిల్లాల వారిగా గాంధీ భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, సంబంధిత ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథం, విష్ణు నాద్ లు వారి వారి బాధ్యత ఉన్న జిల్లాలలో డీసీసీ అధ్యక్షులు, సిసిసి అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీ లు మాజీ ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్సీ లు, ఫ్రంటల్ చైర్మన్ లు ఇంకా ముఖ్య నాయకులు పాల్గొంటారు.
రేపు ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముందుగా వరంగల్ జిల్లా, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా, 4 గంటల నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటె ఈరోజు సాయంత్రం తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 4 గంలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన అంశాలతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన పరిహారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read Also : Vote For Note Case : సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట