Fish Medicine : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదానికి పోటెత్తిన జనం
చేప మందు (Fish Medicine) కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడం తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది
- By Sudheer Published Date - 03:52 PM, Sat - 8 June 24

మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీకి జనం పోటెత్తారు. చేప మందు (Fish Medicine) కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడం తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం శ్యాం ప్రసాద్, దానం నాగేందర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ముందుగా చేప ప్రసాద పంపిణీ చేప ప్రసాదాన్ని దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్నాథ్ గౌడ్, సోదరుడు గౌరీ శంకర్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేప మందును వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 150 సంవత్సరాలుగా చేప మందు పంపిణీ జరుగుతుందన్నారు. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారని తెలిపారు. అస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ఫిష్ మెడిసిన్ వేసుకుంటారని, వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం ప్రజలు వస్తున్నారని తెలిపారు. క్యూలైన్‌లో ఉన్నవారికి నాలుగు గంటలకుపైగా సమయం పడుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ పంపిణీ కార్యక్రమం రేపటి వరకు కొనసాగనుంది.
చేప మందు తీసుకుంటే ఆస్తమా, ఉబ్బసం, శ్వాస సమస్యలు తొలగి పోతాయంటూ కొందరు విశ్వసిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం రెండ్రోజులపాటు బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తుంటారు. మృగశిర కార్తె తర్వాత మాత్రమే వారు చేప మందు ఇవ్వడం ప్రత్యేకం. బత్తిని సోదరుల ఇంట్లో ఉన్న బావి నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని కొంతమంది విశ్వసిస్తారు. ఆ నీటితో ప్రసాదం తయారు చేయడంతో శ్వాస సంబంధిత బాధితులు ఎగబడుతున్నారు. మందును చేప పిల్లల నోట్లో కుక్కి.. దాన్ని బాధితుల గొంతులో వేస్తారు. దీంతో వారికి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయని బత్తిని సోదరులు చెప్తుంటారు.
Read Also : Teenamar Mallanna : తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్