HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Deputy Chief Minister Sisodias Arrest Is Undemocratic Ktr Harish

KTR and Harish: ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్, హరీశ్

సిసోడియాను అరెస్టు చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమని తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అన్నారు.

  • Author : Balu J Date : 26-02-2023 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR harish Rao
KTR harish Rao

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమని తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అన్నారు. ‘‘సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి అరెస్టులు చేస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అర్థబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసింది. కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంత నీచంగా వ్యవహరించిందో.. దేశమంతా చూసింది’’ అని కేటీఆర్, హరీశ్ రావు అన్నారు.

‘‘ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకున్నది. ఆప్ ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. రాజకీయంగా ఆప్ను ఎదుర్కోలేక సీబీఐని అడ్డంపెట్టుకొని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిని లిక్కర్ స్కాంలో ఇరికించి అరెస్టు చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు కళంకం తెచ్చేలా బీజేపీ వ్యవహరిస్తున్నది. దేశంలో ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రత్యర్ధి, ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బెదిరిస్తోంది. బీజేపీ ఆటలు సాగవు. ప్రజలు ఆపార్టీకి బుద్దిచెప్పే రోజులు అతిత్వరలోనే రాబోతున్నాయి’’ అని కేటీఆర్, హరీశ్ రావు హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • condemn and criticism
  • Delhi liquor case
  • harish rao
  • ktr

Related News

Ktr

పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన ఫిట్‌నెస్‌పై చేసిన ఓ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో అడుగుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. పొట్టను దాచుకోవడం కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చమత్కరించారు. ఈ మేరకు కేటీఆర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “పొట్టను దాచుకోలేక విసిగి

    Latest News

    • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

    • Nandigam Suresh : నందిగం సురేష్‌పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?

    • Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

    • సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

    • కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd