Dengue fever in Telangana : తెలంగాణలో విజృభిస్తున్న డెంగ్యూ ..నిన్న ఒక్క రోజే ఐదుగురు మృతి
పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి
- By Sudheer Published Date - 12:22 PM, Wed - 21 August 24

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలతో దోమలు వ్యాప్తిచెందడంతో హైదరాబాద్ (Hyderabad) నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue fever) ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు డెంగ్యూ తో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ సగటున 10-30 శాతం వరకు పెరగినట్లు అధికారులు చెపుతున్నారు. దాదాపుగా ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ అదే పరిస్థితి ఉంది. వర్షాలు కురుస్తుండటంతో గత ఇరవై రోజులుగా జ్వారల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదుగురు మృత్యువాత పడటంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ విస్తరించడంతో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేసింది. కామారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాలలో డెంగీ జ్వరాల తీవ్రతకు గురై ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు మండలానికి చెందిన మూడు సంవత్సరాల చిన్నారి డెంగీ బారిన పడి మృతి చెందాడు. మహబూబాబాద్ కు చెందిన నాలుగేళ్ల హత్విక మంగళవారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే కే సముద్రంలో 34 సంవత్సరాల శిరీష అనే మహిళ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. అలాగే కామారెడ్డి జిల్లాకు చెందిన చౌహాన్ పీరేందర్ అనే 21 ఏళ్ల బీటీెక్ విద్యార్థి , నాగర్ కర్నూల్ కు చెందిన బీటెక్ చదువుతున్న 21 ఏళ్ల నిఖిత కూడా డెంగీ బారిన పడి మృతి చెందింది. సిద్ధిపేటకు చెందిన బానోత్ కిషన్ అనే 47 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్స్ ను సంప్రదించాలని అధికారులు చెపుతున్నారు. దోమల నివారణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలనీ కోరుతున్నారు.
Read Also : Oppo A3 5G: అద్భుతమైన ఫీచర్ తో ఒప్పో ఫోన్.. కింద పడిన ఏం కాదంటూ!