Delimitation : లోక్ సభ స్థానాల పునర్విభజనలో `సౌత్` కోత
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మీద కేటీఆర్ ఆందోళన చెందుతున్నారు.దక్షిణ భారత అన్యాయం చేసేలా పునర్విభజన ఉందని ఆరోపించారు.
- Author : CS Rao
Date : 30-05-2023 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
రాబోవు రోజుల్లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మీద మంత్రి కేటీఆర్ ఆందోళన చెందుతున్నారు. దక్షిణ భారత దేశానికి అన్యాయం చేసేలా కేంద్రం పునర్విభజన ప్రక్రియ ఉందని ఆరోపించారు. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నివేదికను ఉటంకించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల సీట్ల వాటా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణలతో కూడిన మొత్తం దక్షిణాది ప్రాంతాన్ని అధిగమిస్తుందని కేటీఆర్ ఉద్ఘాటించారు.
డీలిమిటేషన్ అంటే ఏమిటి? (Delimitation)
డీలిమిటేషన్ అనేది దేశంలోని నియోజకవర్గాలు లేదా ఎన్నికల జిల్లాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియ(Delimitation). ఇది ప్రాథమికంగా పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభలో సీట్ల కేటాయింపుకు సంబంధించినది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2) ప్రకారం, ఈ సీట్లను ప్రతి రాష్ట్రానికి వారి జనాభా ఆధారంగా దామాషా ప్రాతినిధ్యాన్ని నిర్ధారించే పద్ధతిలో తప్పనిసరిగా కేటాయించాలి. తాజా జనాభా గణన డేటాను ఉపయోగించి సీట్లు కాలానుగుణంగా తిరిగి కేటాయించబడతాయి.
జనాభా గణన ఆధారంగా 2026 తర్వాత లోక్‌సభ స్థానాల తదుపరి సవరణ
అయితే, 1976లో, కుటుంబ నియంత్రణ విధానాలను ప్రోత్సహించడానికి 42వ సవరణకు అనుగుణంగా 2001 జనాభా లెక్కల తర్వాత సీట్ల సవరణను నిలిపివేసింది. తదనంతరం, 2002లో 84వ సవరణ ద్వారా పార్లమెంటు పునర్విభజనను మరింత ఆలస్యం చేసింది. 2026 తర్వాత నిర్వహించిన మొదటి జనాభా గణన ఆధారంగా 2026 తర్వాత లోక్‌సభ స్థానాల తదుపరి సవరణ జరగనుంది.
Also Read : KTR Tweet: పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజే రెజ్లర్లపై దాష్టీకం దురదృష్టకరం: కేటీఆర్
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలతో కూడిన దక్షిణ భారత రాష్ట్రాలు జనాభా నియంత్రణ చర్యల్లో రాణించాయని, అయితే ఇప్పుడు సీట్ల పునర్విభజన కారణంగా ప్రాతినిధ్యం కోల్పోయే అవకాశం ఉందని కేటీఆర్ భావిస్తున్నారు. భారతదేశ జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న దక్షిణ భారత రాష్ట్రాలు దేశ జిడిపికి 35 శాతం ఉందని ట్వీట్ ద్వారా వివరించారు. ఈ గణాంకం దక్షిణ భారతం ఆర్థిక సహకారాన్ని హైలైట్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయి. అయితే, రాబోయే డీలిమిటేషన్ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది.
దక్షిణ భారత రాష్ట్రాలపై డీలిమిటేషన్ చిక్కులు
కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నివేదిక ప్రకారం, ఏ రాష్ట్రమూ ప్రాతినిధ్యాన్ని కోల్పోకూడదనే సూత్రాన్ని కొనసాగించాలంటే లోక్‌సభలో గరిష్ట సీట్ల పరిమితిని 848కి పెంచాలి. ఉత్తరప్రదేశ్, బీహార్‌ల సీట్ల వాటా 222కి పెరుగుతుందని, దక్షిణ భారత రాష్ట్రాల సీట్ల వాటా 165కి తగ్గుతుందని నివేదిక సూచిస్తుంది. అదనంగా, ఇతర రాష్ట్రాల సీట్ల వాటా 461 అవుతుంది. అంటే, రాబోవు రోజుల్లో ఉత్తర భారతం హవా రాజకీయంగా కొనసాగబోతుంది. అందుకే, ఇప్పుడు కేటీఆర్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఎక్కుపెట్టారు.
Also Read : BRS Lose: ఆ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇస్తే.. 14 సీట్లు ఓడిపోవడం పక్కా!
దక్షిణ భారత రాష్ట్రాల సీట్ల వాటా 165కి తగ్గుతుందని నివేదిక (Delimitation)
నార్త్ , సౌత్ ఫీలింగ్ మొదటి నుంచి ఇండియాలో ఉంది. దాన్ని మరింత ఎలివేట్ చేసేలా మంత్రి కేటీఆర్ వాయిస్ పెంచారు. ఉమ్మడి ఏపీని విడగొట్టడానికి సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు దేశాన్ని సౌత్, నార్త్ గా విభజన(Delimitation) చేయడం ద్వారా సౌత్ లో రాజకీయ లబ్దిపొందాలను మంత్రి కేటీఆర్ తొలి అడుగు వేస్తూ డీలిమిటేషన్ ప్రక్రియను తెరమీదకు తీసుకొచ్చారు.