BJP: బీజేపీ అలర్ట్, ఢిల్లీకి ఈటల, కోమటిరెడ్డి!
- Author : Hashtag U
Date : 23-06-2023 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
బీజేపీలో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్లు సమాచారం. వారిద్దరినీ పార్టీ నేతలు శుక్రవారం ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈటల, రాజగోపాల్ రెడ్డి శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అనూహ్యంగా బలహీనపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు రావాలని కోరుతున్న ఈటల, రాజగోపాల్ లు అది జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో వీరిద్దరూ తమ పార్టీలో చేరతారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఇద్దరు నేతలు ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వీరిద్దరికీ బీజేపీ నేతల నుంచి పిలుపు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఢిల్లీ పర్యటన తర్వాత ఈటల, రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: Virat Kohli: బొద్దుగా ఉండే కోహ్లీ సూపర్ ఫిట్ గా ఎలా మారాడంటే!