Sangareddy Chemical Factory Blast : 42కు చేరిన మృతుల సంఖ్య
Sangareddy Chemical Factory Blast : ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఆఫీసు కాంప్లెక్స్ శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు
- By Sudheer Published Date - 09:07 AM, Tue - 1 July 25

సంగారెడ్డి జిల్లాలోని రసాయన పరిశ్రమలో జరిగిన భీకర విస్ఫోటనం (Sangareddy Chemical Factory Blast) రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఆఫీసు కాంప్లెక్స్ శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాలను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పునరావాస పనుల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది సమిష్టిగా పనిచేస్తున్నారు.
PM Modi : మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటన
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శిథిలాల కింద ఇంకా 20 మందికిపైగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలను గుర్తించినట్టు వెల్లడించగా, కొన్ని మృతదేహాలు పూర్తిగా గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని సమాచారం. ఈ ఘటనలో మరణించినవారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులే. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఇకపోతే ప్రమాదంలో గాయపడిన 33 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమ నిర్వహణలో నిర్లక్ష్యం, భద్రతా లోపాల కారణంగానే ఈ విస్ఫోటనం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదం పై రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
Dry Nail Polish: ఎండిపోయిన నెయిల్ పాలిష్‌ను మళ్లీ ఉపయోగించాలా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(Modi), తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, కార్మికులను కాపాడేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ సైతం బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన కార్మికులను చందానగర్, ఇస్నాపూర్ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.