DAV School Reopen: డీఏవీ స్కూల్ రీఓపెన్.. బట్ కండీషన్స్ అప్లయ్!
డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను గురువారం (నవంబర్ 3) నుంచి పునఃప్రారంభించేందుకు విద్యాశాఖ పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి
- By Balu J Published Date - 11:56 AM, Wed - 2 November 22
డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను గురువారం (నవంబర్ 3) నుంచి పునఃప్రారంభించేందుకు విద్యాశాఖ పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది. నాలుగున్నరేళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు బంజారాహిల్స్ రోడ్ నెం: 14లోని బాదం సరోజాదేవి డీఏవీ పబ్లిక్ స్కూల్ డ్రైవర్ రజనీ కుమార్‌ను అక్టోబర్ 18న పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేశారు.
దీంతో ప్రభుత్వం అక్టోబరు 22న పాఠశాల అనుమతిని రద్దు చేసింది. బంజారాహిల్స్‌లోని పాత భవనంలో పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 650 మంది విద్యార్థుల తల్లిదండ్రులు అక్టోబర్ 23న కేబీఆర్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా కలిశారు. పాత భవనంలో పాఠశాలను పునఃప్రారంభించాలని కోరుతూ DEO రోహిణి.
పాఠశాల తెరవడంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించేందుకు అధికారులు బ్యాలెట్ విధానాన్ని నిర్వహించారు. 95% మంది తల్లిదండ్రులు దీనికి మద్దతు ఇచ్చారు. స్కూల్ డైరెక్టర్ నిషా కూడా ఇటీవల పాఠశాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాలలో భద్రతా ఏర్పాట్లు చేయాలని పాఠశాల అధికారులను డీఈవో ఆదేశించారు. యధావిథిగా పాఠశాల ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.అయితే గతంలో జరిగిన ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా స్కూల్ యాజమాన్యం విద్యార్థుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయనుంది. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులకు భద్రతను కల్పించనున్నారు.
Related News
Amit Shah ‘Deepfake’ Video Case: ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్‌తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.