Cyberabad Police: గంజాయిపై సమాచారముంటే ఈ కింది వాట్సాప్ నెంబర్ కి పంపాలని విజ్ఞప్తి చేసిన సైబరాబాద్ పోలీసులు
సైబారాబాద్ పరిధిలోని గంజాయి అమ్మకాలపై, వినియోగదారులపై పోలీసుల తనిఖీలు పెంచారు.
- By Hashtag U Published Date - 03:01 PM, Sun - 21 November 21

సైబారాబాద్ పరిధిలోని గంజాయి అమ్మకాలపై, వినియోగదారులపై పోలీసుల తనిఖీలు పెంచారు. గంజాయి ఎక్కడినుండి వస్తోంది. ఎక్కువమొత్తంలో రెగ్యులర్ గా ఎవెరెవరు కొంటున్నారు. ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనే అంశంపై పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
పోలీసులు నిర్వహిస్తోన్న తాజా రైడ్స్ లో రెండురోజుల్లో రెండు కోసులు నమోదు చేశామని, ఏడుగురు నేరస్తులను అరెస్ట్ చేశామని, వీరిదగ్గర 1.5 కేజీల గంజాయి, 88 వీడ్ ఆయిల్ బాటిల్స్, 3 ఎల్ఎస్డీ పేపర్స్, కొన్ని గ్రాముల ఇతర డ్రగ్స్ దొరికినట్టు పోలీసులు తెలిపారు.
🔆The Cyberabad police stepped up its drive against #Ganja trade-in Cyberabad commissionerate limits, Continuous raids are being conducted on a daily basis.
🔆@cpcybd felicitated Staff for the Good work.@RachakondaCop @SCSC_Cyberabad @cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/yv9v5f5z93— CP Cyberabad (@cpcybd) October 28, 2021
సైబారాబాద్ పరిధిలో డ్రగ్స్ తో సంబంధమున్న 11 మంది నేరస్థులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డ్రగ్స్ కి సంబంధించి ఎవరికైనా, ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇవ్వడానికి 100 నెంబర్ కి కాల్ చేయొచ్చని, సైబర్ ఎన్ఫోర్స్మెంట్ నెంబర్ 7901105423 లేదా వాట్స్పప్ నెంబర్ 9490617444 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Related News

Ganja : వైజాగ్లో డ్రగ్స్, గంజాయి ముఠాలపై పోలీసులు నిఘా.. త్వరలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు
ఏపీ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు నిఘా పెట్టారు. ప్రధానంగా వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్, గంజాయి ముఠా అక్రమ