HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Court Dismisses Key Charges In Singareni Case

BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

  • Author : Prasad Date : 02-06-2026 - 8:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balka Suman
Balka Suman

సింగరేణి సంస్థలకు సంబంధించిన వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన పలు అభియోగాలను నాంపల్లి కోర్టు కొట్టివేస్తూ.. రెండు సెక్షన్ల కింద మాత్రమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. బీఎన్ఎస్ సెక్షన్లు 152, 353(1)(బి) మాత్రమే ఈ కేసుకు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం (PDPP Act)తో పాటు పోలీసులు నమోదు చేసిన ఇతర అభియోగాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మే 26న తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ సందర్భంగా నాంపల్లిలోని సింగరేణి భవన్, మందమర్రిలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయానికి సంబంధించిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

సింగరేణి భవన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి పోలీసులు బాల్కా సుమన్‌పై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 152, 353(1)(బి)తో పాటు 61(2)(ఎ), 326(జి), 351(3) మరియు ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టంలోని నిబంధనలను కూడా కేసులో చేర్చారు. కేసు నమోదు అనంతరం బాల్కా సుమన్‌ను తెలంగాణ భవన్‌లో పోలీసులు అరెస్టు చేసి, మే 30న కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సింగరేణి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని పిలుపునిచ్చారని ఆరోపిస్తూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తాజా విచారణలో ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిబంధనలు ఈ కేసులో వర్తించవని నాంపల్లి కోర్టు అభిప్రాయపడింది. దీంతో పోలీసులు నమోదు చేసిన పలు సెక్షన్లు రద్దయ్యాయి. అయితే బీఎన్ఎస్ సెక్షన్లు 152 మరియు 353(1)(బి) కింద కేసు విచారణ కొనసాగించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కేసు దర్యాప్తు ఈ రెండు అభియోగాల పరిధిలోనే కొనసాగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • EX MLA Balka Suman
  • singareni

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Supreme Court

    Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • Mamata Banerjee: మమతా బెనర్జీ కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు

  • Telangana: మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త.. మహిళా శక్తి సూపర్ బజార్లు

  • Annamalai: బీజేపీకి అన్నామలై బిగ్ షాక్..

  • CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd