Corn Polymer : ప్లాస్టిక్‌కు నై.. కార్న్ పాలిమర్‌కు జై.. పెరుగుతున్న వినియోగం
కార్న్ పాలిమర్‌ను(Corn Polymer) మొక్కజొన్న పిండితో తయారు చేస్తారు. అందుకే ఈ సంచులు నేచురల్.
- By Pasha Published Date - 03:35 PM, Wed - 6 November 24

Corn Polymer : ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టే మహత్తర మాధ్యమంగా కార్న్ పాలిమర్ జనంలో క్రేజీని పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దీని వినియోగం మునుపటి కంటే గణనీయంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం,గుంటూరులలో దీని సేల్స్ బాగా పెరిగాయని తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ నగరాల్లో ప్రతిరోజూ రిలీజ్ అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 15 శాతం మాత్రమే కార్న్ పాలిమర్ బ్యాగులు ఉంటున్నాయి. వీటి వినియోగం ఇంకా పెరగాలి. అప్పుడు పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్లాస్టిక్ భూతం నుంచి పుడమి తల్లికి విముక్తి లభిస్తుంది.
Also Read :One State One RRB : ‘ఒక రాష్ట్రం.. ఒకే రీజియనల్ రూరల్ బ్యాంక్’.. విలీనాలు షురూ
ఏమిటీ కార్న్ పాలిమర్ ?
- కార్న్ పాలిమర్‌ను(Corn Polymer) మొక్కజొన్న పిండితో తయారు చేస్తారు. అందుకే ఈ సంచులు నేచురల్.
- కార్న్ పాలిమర్ సంచులు కేవలం 180 రోజుల్లోగా భూమిలో కరిగిపోతాయి.
- కాగితం, జూట్, క్లాత్ బ్యాగుల కంటే కార్న్ పాలిమర్ సంచుల వినియోగమే బెస్ట్ అని అంటున్నారు.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ సగటున 8 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. అయితే వీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే వ్యవస్థ నగర పాలక సంస్థ వద్ద అందుబాటులో లేదు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది.
- ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై బ్యాన్ ఉన్నప్పటికీ.. చాలాచోట్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను విరివిగా వాడుతున్నారు.
- మనకు తెలియకుండానే శరీరంలోకి ప్లాస్టిక్ ప్రవేశిస్తుందని పలు అధ్యాయనాల్లో వెల్లడైంది. మైక్రోప్లాస్ట్ కణాలు శరీరంలోకి వాటంతట అవే ప్రవేశిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం, నీరు గాలి ద్వారా శరీరంలోకి ఈ ప్లాస్టిక్ ఎంటర్ అవుతోంది.
- 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ లేదా 1 నానోమీటర్ మోతాదు కలిగిన మైక్రోప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరుతున్నాయి.
- మనిషి మెదడులోకి కూడా మైక్రోప్లాస్టిక్ చేరుతోందని ఇటీవలే అధ్యయన నివేదికలు వచ్చాయి.