Congress vs BRS : అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ నగరంలో భారీగా ప్లెక్సీ లు..
నేడు నగరవ్యాప్తంగా హరీష్ రావు రాజీనామా చేయాలనీ.. అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు
- By Sudheer Published Date - 07:08 PM, Fri - 16 August 24

కాంగ్రెస్ పార్టీ (Congress Party ) చెప్పినట్లే ఆగస్టు 15 న మూడో విడత రైతు రుణ మాఫీ (Runamafi ) కూడా పూర్తి చేసింది. మొదటి విడత లో లక్ష లోపు , రెండో విడత లో లక్షన్నర , మూడో విడత లో రెండు లక్షల రుణ మాఫీ ని పూర్తి చేసి మాట నిలుపుకుంది. కాంగ్రెస్ అంటే మాట నిలుపుకునే పార్టీ అని..కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ..గత ప్రభుత్వం బిఆర్ఎస్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఫై ఓ రేంజ్ లో విమర్శలు , సవాళ్లు , ఛాలెంజ్ లు చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న వైరా సభలో సీఎం రేవంత్ ఏ రేంజ్ లో హరీష్ రావు ఫై చిందులు వేసారో తెలియదు కాదు..ఇది చాలదు అన్నట్లు నేడు నగరవ్యాప్తంగా హరీష్ రావు రాజీనామా చేయాలనీ.. అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు. చెప్పినట్టు రుణమాఫీ చేశామని తమకు రాజీనామా ఎప్పుడు చేస్తారని ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్‌రావును టార్గెట్ చేశారు.
ఇక కాంగ్రెస్ రుణమాఫీ ప్రచారం ఫై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వంద శాతం రుణమాఫీ ఎక్కడ జరిగిందని కాంగ్రెస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై మీరు చెప్పిన మాటల్లో నిజం ఒక్క శాతం నిజం ఉన్నా సరే.. సెక్యూరిటీ లేకుండా నీ కొడంగల్ నియోజకవర్గానికి రావాలని సవాలు విసిరారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో అయినా సరే వంద శాతం రుణమాఫీ జరిగిందని చెబితే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని అన్నారు. రాజకీయాలు వదిలేసి.. ఇంట్లోనే కూర్చుంటానని స్పష్టం చేశారు. మరి కేటీఆర్ సవాల్ కు సీఎం రేవంత్ సై అంటాడా..?
Read Also : Study : ఆందోళనకరంగా వైద్య విద్యార్థుల మానసిక పరిస్థితి.. తాజా సర్వే