HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Panel To Vet Newcomers

Congress Panel: టీకాంగ్రెస్ ‘ఆకర్ష్’.. చేరికలపై ఫోకస్!

కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతల చేరికలను పరిశీలించేందుకు కమిటీకి సోనియా గాంధీ ఆమోదం తెలిపారు.

  • Author : Balu J Date : 21-04-2022 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sonia Gandhi
Sonia Gandhi Congress

కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతల చేరికలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారు. మాజీ మంత్రి కె. జానారెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ ప్యానెల్‌లో టీపీసీసీ చీఫ్‌ ఏ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్‌లు పొన్నాల లక్ష్మయ్య, ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఐదుగురు సభ్యులుగా ఉంటారు. కాగా, మే 6న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు పార్టీ సిద్ధమైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఏప్రిల్ 21న వరంగల్‌కు రానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించనున్నారు.

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే రేవంత్ రెడ్డితో ఇతర పార్టీల నేతలు టచ్ లోకి వచ్చారు. ఆయన వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, ఆకర్ష్ కు తెరలెపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్, డీఎస్ కుమారుడితో సైతం సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారు కావడంతో టీకాంగ్రెస్ ఇతర పార్టీల నేతలపై ఫోకస్ చేస్తోంది. రాహుల్ సమక్షంలో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధిష్టానం చేరికల కోసం ప్రత్యేక కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rahul gandhi
  • revanth reddy
  • sonia gandhi
  • TCongress

Related News

No change in Karnataka Chief Minister for now Congress President Mallikarjun Kharge

Karnataka : సీఎం కుర్చీ ఖాళీగా లేదు: ఖర్గే మల్లికార్జున ఖర్గే

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే మరోసారి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని తెలిపారు. నాయకత్వ సమస్యపై నెలకొన్న గందరగోళాన్ని పార్టీ అధిష్ఠానం కూడా త్వరలోనే నివృత్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని చెప్పారు. కర్ణాటక కాంగ్ర

    Latest News

    • Chhattisgarh : IED పేలి ముగ్గురు జవాన్లు మృతి

    • Dr. Bhaskar Jyoti Sonowal : గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడిగా డాక్టర్ భాస్కర్ జ్యోతి సోనోవాల్ ఏకగ్రీవం

    • Movie Shooting : తమిళనాడు లో షూటింగ్స్ బంద్.. ఎందుకంటే?

    • Klook : పర్యాటకులకు క్లూక్ బంపర్ ఆఫర్..ఫరా ఖాన్‌తో కలిసి సింగపూర్‌ను చుట్టేయండి!

    • Amazon Prime Day : జూలైలో అమెజాన్ ప్రైమ్ డే 2026 ..ఆఫర్సే ఆఫర్స్

    Trending News

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd