‘ ENO ‘ ను ఇలా కూడా వాడొచ్చా..? కాంగ్రెసా..మజాకా..!
ENO : 'రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO' అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు
- By Sudheer Published Date - 12:03 PM, Sat - 25 January 25

ENO పౌడర్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. (అసిడిటి) సమస్య తో బాధపడుతున్నవారు ENO పౌడర్ ను నీటిలో కలిపి తాగితే ఆమ్లపిత్తం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇదే విషయాన్నీ ENO సంస్థ యాడ్స్ ద్వారా ప్రజలకు సూచిస్తుంటుంది. అయితే ఇప్పుడు ENO పౌడర్ ను తెలంగాణ కాగ్రెస్ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. అది తమదైన శైలి లో.
దావోస్ (Davos) పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్న వేళ అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ‘రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO’ అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. దానిపై KCR, KTR ఫొటోలను ముద్రించడం గమనార్హం. నిన్న బీఆర్ఎస్ నేతలకు పలువురు కాంగ్రెస్ నేతలు ENO ప్యాకెట్లు పంపిన సంగతి తెలిసిందే.
Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్‌లో ఎంతో తెలుసా.?
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమాశంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. గేమ్ చేంజర్‌లాగా రైజింగ్ తెలంగాణ కోసం రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులు తీసుకు వస్తే.. అది చూసి బీఆర్ఎస్ వాళ్లు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈనో (ENO) ప్యాకెట్లు కొరియర్ చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతల కడుపు మంట తగ్గడం కోసం.. వారికి ENO ప్యాకెట్లు పంపిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ వాళ్ళకి జీర్ణించుకునే తత్వం పెరగడం కోసం ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. ఈరోజు ఏకంగా నగరంలో భారీ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి ప్రచారం మొదలుపెట్టారు. ఇది చూసి కాంగ్రెసా..మజాకా..! అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
పెట్టుబడులు చూసి కడుపు మంటా?
వాడండి ENO..కేసీఆర్,కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు,హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు
కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ,హైదరాబాద్ లో భారీగా హోర్డింగ్ లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు pic.twitter.com/vsgi6gDQQz
— HEMA NIDADHANA (@Hema_Journo) January 25, 2025