Kamareddy: కొంపముంచేలా అజారుద్దీన్ శైలి!
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయా? సీనియర్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయా?
- By Hashtag U Published Date - 03:02 PM, Thu - 7 April 22
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయా? సీనియర్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయా? పార్టీ పెద్దలు ఆదేశించినా.. నాయకుల మధ్య ఐక్యత లోపించిందా? అంటే పార్టీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే తాజాగా జరిగిన ఒక సంఘటన పార్టీ నేతల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. మాజీ క్రికెటర్ ఆజారుద్దీన్ వ్యవహార శైలే దీనంతటికీ కారణమని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అజారుద్దీన్ ఒక్కప్పుడు ఇండియా క్రికెట్ కు కెప్టెన్ గా వ్యవహారించారు. తన ఆటతో తీరుతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పదిహేను సంవత్సరాల పాటు దేశానికి సేవలందించారు అజారుద్దీన్ . మ్యాచ్ ఫిక్సింగ్ కారణంతో ఆయన క్రికెట్ కు దూరమయ్యారు. తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ లో కండువా కప్పుకుని…యూపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీతో తనకున్న సాన్నిహిత్యంతో తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనూ పోటీచేయాలని ఆయన భావిస్తున్నారు.
రెండు రోజుల క్రితం కామారెడ్డి పర్యటకు వెళ్లారు అజారుద్దీన్. హైకమాండ్ ఆదేశిస్తే..కామారెడ్డి నుంచి తాను బరిలోకి దిగుతానని వెల్లడించారు. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ముఖ్యంగా షబ్బీర్ అలీ వర్గీయులు ఈ వార్త విని కంగుతిన్నారట. కాంగ్రెస్ సీనియర్ నేతగా షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పలుమార్లు గెలుపొందారు. మంత్రిగా కూడా పదవులు చేపట్టారు. NSUI కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చారు షబ్బీర్ అలీ. అప్పటి నుంచి పార్టీలోనే ఉంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన డి. శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలు పార్టీలు మారినా…షబ్బీర్ అలీ మాత్రం కాంగ్రెస్ జెండాను వదలలేరు. పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు. మరోమారు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న తరణంలోనే అజారుద్ధీన్ కామెంట్స్ షాకిచ్చినట్లయ్యింది.
నిజానికి ముస్లిం కోటాలో తనకు రావాల్సిన వర్కింగ్ ప్రెసిండెంట్ పదవిని అజారుద్దీన్ తన్నుకుపోయారు. ఇప్పుడు అసెంబ్లీ స్థానానికి కూడా గురి పెడుతుండటంతో షబ్బీర్ అనుచరులకు మింగుడుపడటంలేదట. అయితే షబ్బీర్ అలీ మాత్రం కాన్ఫిడెంట్ తోనే ఉన్నారట. రేవంత్ రెడ్డి అండ ఉండటంతో…తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారట షబ్బీర్ అలీ. కామారెడ్డి టికెట్ అజారుద్దీన్ కా…లేదా షబ్బీర్ కా…ఎవరికీ దక్కుతుంది…హైకమాండ్ ఎవరికీ అనుకూలంగా ఉందో…రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సిందే. !!!
Related News
Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి పొన్నం
Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. అక్కన్నపేటలో పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేసిందన్నారు. ఆరోగ్య బీమా పథకం కింద పేదలు రూ.10 ల