Priyanka Gandhi : ప్రియాంకాగాంధీతో సీఎం రేవంత్ భేటీ.. చర్చించిన అంశాలివే
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీని కలిశారు.
- By Pasha Published Date - 02:07 PM, Mon - 22 July 24

Priyanka Gandhi : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీని కలిశారు. ఆయనతో పాటు ప్రియాంకను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప దాస్ మున్షీ ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ, రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ, ఈ నెలాఖరులో వరంగల్‌లో జరగనున్న రైతు కృతజ్ఞత సభ గురించి ప్రియాంకతో సీఎం రేవంత్ చర్చించారని సమాచారం. తెలంగాణలో రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్ సెషన్‌లో ఉండబోయే కీలక నిర్ణయాలను ప్రియాంకకు(Priyanka Gandhi) వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి రైతు కృతజ్ఞత సభకు సీఎం రేవంత్ ఆహ్వానించనున్నట్లు చెబుతున్నారు.ప్రియాంకాగాంధీతో భేటీకి ముందు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ సమావేశం అయ్యారు.
రేపు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్(CM Revanth) భేటీ అవుతారని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి శాఖ, ఇతర శాఖల మంత్రుల అపాయింట్మెంట్లను సీఎం రేవంత్ కోరినట్లు సమాచారం.
Also Read :WhatsApp New Feature: ఇకపై వాట్సాప్ లో ఇంటర్నెట్ లేకుండానే ఫైల్స్ పంపవచ్చట.. అదెలా అంటే?
వికలాంగుల రిజర్వేషన్లపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని సివిల్స్ ఎగ్జామ్ కోచ్ బాల లత అన్నారు. ఇది ప్రభుత్వం ఆలోచనా ? ఆవిడ సొంత మాటలా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో వికలాంగులు ఉండాలా.. వద్దా చెప్పండి అని నిలదీశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. స్మిత వ్యాఖలకు సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలని బాలలత పేర్కొన్నారు. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.