HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Revealed Sensational Facts About Kcr

CM Revanth : కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ తాపత్రయ పడ్డారు – సీఎం రేవంత్

  • Author : Sudheer Date : 09-02-2024 - 1:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Asem
Revanth Asem

కేటీఆర్ (KTR) ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్ (KCR) పై ఒత్తిడి చేశారు.. కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ ప్రధాని మోడీ (PM Modi)ని కోరారని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఆయన అన్నారు.

కేటీఆర్ ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్ పై ఒత్తిడి చేసారని… కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ మోడీని కోరారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎంను మార్చాలనుకునే పార్టీ అంతర్గత వ్యవహారంలోనూ కేసీఆర్ మోడీ అనుమతి కోరారని చెప్పుకొచ్చారు. గతంలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి ఓటేస్తే..ఆ ముగ్గురు ఎమ్మెల్యేలలను కేసీఆర్ సస్పెండ్ చేశారని రేవంత్ గుర్తు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ అండగా నిలిచిందన్నారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి పలుమార్లు చర్చించుకున్నారు. సీఎంను మార్చుకునే విషయం కూడా మోడీ ఇక్కడే చెప్పారు. కేసీఆర్ మీకు కొన్ని చెబుతారు.. కొన్ని దాస్తారన్నారు.

రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి బంధం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఓడించిందని చెప్పుకొచ్చారు. సీఎంను మార్చుకోవాలంటే ఎవరి అనుమతి అవసరం లేదని.. బీఆర్ఎస్ కే గత ప్రభుత్వం హయాంలో 100 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉందని గుర్తు చేసారు.

Read Also : PV Narasimha Rao : పీవీకి భారతరత్న రావడం పట్ల కేసీఆర్ స్పందన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • kcr
  • ktr
  • Telangana Assembly

Related News

Jeevan Reddy Brs

BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన వెంట సుమారు 40 మంది బలమైన అనుచర గణం

    Latest News

    • ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు ఏదీ?

    • బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

    • RBI కీలక నిర్ణయం..బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్

    • IPL 2026: నేడు లక్నో vs రాజస్థాన్..గెలుపు ఎవర్ని వరిస్తుందో ?

    • RTC Strike : తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd