CM Revanth Reddy Meets Jana Reddy : జానారెడ్డి ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి..జానారెడ్డి నివాసానికి వెళ్లిన ఆయనతో భేటీ అయ్యారు
- Author : Sudheer
Date : 11-12-2023 - 12:12 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..సోమవారం సీఎల్పీ నేత జానారెడ్డి (Janaredy)ని కలిశారు. జానారెడ్డితో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయకుండా తన కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేయించి గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి..జానారెడ్డి నివాసానికి వెళ్లిన ఆయనతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటిసారి జానారెడ్డి ఇంటికెళ్లారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటికే పదకొండు మందికి చోటు కల్పించగా.. మరో ఏడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జానారెడ్డికి కలిసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. హోంమంత్రి పదవి జానారెడ్డి (Home Minister)కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరి నిజంగా జానారెడ్డి కి ఆ పదవి ఇస్తారా..లేదా అనేది చూడాలి. గతంలో జానారెడ్డి హోంమంత్రి గా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటె వచ్చే వారం సీఎం రేవంత్ ఏపీ (Revanth Reddy AP Tour) లో పర్యటించబోతున్నారు. తెలంగాణ ఫలితాల ముందు రేవంత్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో విజయవాడ కనకదుర్గ (Vijayawada Kanaka Durga Temple) అమ్మవారిని దర్శించకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రేవంత్ విజయవాడ కు వెళ్లనున్నారని సమచారం. విజయవాడకు రేవంత్ వస్తే..ఏపీ సీఎం జగన్ తో సమావేశం అవుతారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి నిజంగా రేవంత్ ..జగన్ ను కలుస్తారా లేదా అనేది చూడాలి.
Read Also : Alla Ramakrishna Reddy : వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి