HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Fire On Brs

TS : ఫ్రీ బస్ పథకానికి అడ్డొస్తే బీఆర్ఎస్ శ్రేణులపై ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తాం: రేవంత్

  • Author : Sudheer Date : 12-03-2024 - 8:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revant Brs Free Bus
Revant Brs Free Bus

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బిఆర్ఎస్ (BRS) శ్రేణులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఫ్రీ బస్ పథకానికి (Free Bus Scheme
) అడ్డస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తనదైన పాలనా కొనసాగిస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ వస్తున్న సీఎం..ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..బిఆర్ఎస్ శ్రేణులు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం వద్దని బీఆర్ఎస్ వాదిస్తోందని .. ఫ్రీ బస్ పథకానికి అడ్డస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని హెచ్చరించారు. రానున్న అయిదేళ్లలో మహిళా సంఘాలోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రారంభించినట్లు రేవంత్​రెడ్డి తెలిపారు. మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాల బలోపేతం, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ఈ పథకం తీసుకొచ్చినట్లు స్పష్టం చేసారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు, వచ్చే అయిదేళ్లలో లక్ష కోట్ల ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు.

మహిళా సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పనకు తోడ్పడుతోందని వివరించారు. అలాగే స్వయం సహాయక సంఘాలను ఐఐటీ, ఐఐఎం, ఎస్​బీఐ, ఆర్​ఎంఏతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని , ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. మాట తప్పని, మడమ తిప్పని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. తల్లుల కడుపుకోత గుర్తించి, ఆ బాధను చూడలేక కనికరించిందని చెప్పారు. కళ్లముందు భర్తను కొల్పోయిన మహిళ.. ఏపీలో పార్టీ చచ్చిపోయిన పర్వాలేదు.. కేంద్రంలో అధికారం పోయిన లెక్కచేయకుండ తెలంగాణ ఇచ్చిందని పొగిడారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, సోనియమ్మ అన్నారు. మహిళా నాయకత్వంలో పనిచేస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

Read Also : Mahalakshmi Swashakti Scheme : ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm revanth
  • free bus

Related News

Cm Revant Good News

Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తండావాసుల జీవితాల్లో వెలుగులు నింపేలా భారీ ప్రకటనలు చేశారు

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

    Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

  • Ap Govt Good News

    Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

Latest News

  • పాక్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం.. సూపర్ 8కు టీమిండియా!

  • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

  • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

  • డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు

  • పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భార‌త్‌!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd