CM Revanth Reddy : మొత్తం మీరే చేసారంటూ..మీడియా ఫై సీఎం రేవంత్ కామెంట్స్
మంత్రి వర్గ విస్తరణ...పీసీసీ నియామకం ఏమైందని అడుగగా..దానికి రేవంత్ ..మొత్తం మీ మీడియా వారే చేసారంటూ సమాధానం తెలిపారు
- Author : Sudheer
Date : 04-07-2024 - 9:19 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క అధిష్టానం పెద్దలతో సమావేశం , మరోపక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులు , కేటాయింపు తదితర అంశాల గురించి కేంద్ర మంత్రులతో , ప్రధాని మోడీ తో సమావేశం అవుతూ బిజీ గా గడిపారు. ఈరోజు మోడీ తో సమావేశమై పలు కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..మోడీ తో జరిగిన సమావేశాల గురించి వివరించి..ఆ తర్వాత మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
వీటిలో మంత్రి వర్గ విస్తరణ…పీసీసీ నియామకం ఏమైందని అడుగగా..దానికి రేవంత్ ..మొత్తం మీ మీడియా వారే చేసారంటూ సమాధానం తెలిపారు. ”మంత్రి వర్గాన్ని మీరు విస్తరించారు. మీరే వాయిదా వేశారు” అని మీడియాను ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశారు. ఫలాతా తేదీన కేబినెట్ విస్తరణ అని తాను ఏమి చెప్పలేదని, ఆ తేదీని మీరే ఫిక్స్ చేసారు..మీము కాదన్నారు. ఈ అంశాలపై అధిష్టానమే చూసుకుంటుంది. అధిష్టానం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు జరుగుతుంది. తాము నూతన పిసిసి నియామకం జరగాలని, క్యాబినెట్ ను విస్తరించాలని ఏఐసిసి అధ్యక్షుడిని కోరుకున్నామని హై కమాండ్ పరిశీలనలో ఈ అంశాలు ఉన్నాయన్నారు. పీసీసీ నియామకం విషయంలో ఏకాభిప్రాయమే ఉందని, నేనే పీసీసీ నియామకం కావాలని అడుగుతున్నానని చెప్పుకొచ్చారు.
Read Also : KTR : రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా..స్వాగతించిన కేటీఆర్