New Sand Policy : ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ- సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- By Sudheer Published Date - 11:18 PM, Thu - 8 February 24

తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వాటిని మార్చడం..వాటి స్థానాల్లో కొత్తవి పెట్టడం ఇలా చేసారు. అలాగే గత ప్రభుత్వంలో పనిచేసిన వారి ఫై కూడా వేటు వేయడం , బదిలీ చేయడం వంటివి చేసారు. తాజాగా ఇక ఇప్పుడు ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తీసుకరావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని, అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని , లేదంటే రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని సీఎం హెచ్చరించారు.
అలాగే అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఇసుక రీచ్ లు, డంప్ లన్నీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ హెచ్చరికలతో ఇసుకరాయుళ్లు షాక్ లో పడ్డారు.
Read Also : Jagan Publicity : సీఎం జగన్ పబ్లిసిటీ చేసుకోరట..రోజమ్మ కాస్త అనే ముందు చూసుకోమ్మా..