CM Revanth Reddy : నేడు పెద్దపల్లిలో సీఎం రేవంత్ పర్యటన.. జిల్లాపై నిధుల వర్షం
CM Revanth Peddapalli : గత కొంతకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న పెద్దపల్లిలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.82 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తీరటమే కాకుండా, సులభమైన రవాణా సాధ్యం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు
- By Sudheer Published Date - 08:00 AM, Wed - 4 December 24

నేడు పెద్దపల్లి(Peddapalli Tour)లో సీఎం (CM Revanth Reddy) పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. ఈ పర్యటనకు ముందు జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్దపల్లి జిల్లాలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల మంజూరు చేయడం జరిగింది.
గత కొంతకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న పెద్దపల్లిలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.82 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తీరటమే కాకుండా, సులభమైన రవాణా సాధ్యం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇది జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా మారనుంది. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగుపరచడానికి రూ.51 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ఆసుపత్రి పడకల సంఖ్యను 50 నుంచి 100కు పెంచేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రి విస్తరణ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
దీంతో మంథనిలోని 50 పడకల ఆసుపత్రి అభివృద్ధికి కూడా రూ.22 కోట్ల నిధులు కేటాయించారు. ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పెంచి, ప్రజలకు మరింత సమర్థవంతమైన వైద్య సేవలు అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ప్రభుత్వ చర్యలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్షణ సాయంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసారు. సీఎం సభ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరాబోతుండడం తో వారికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మంత్రులు అధికారులను , పార్టీ నేతలను ఆదేశించారు.
Read Also : Pushpa 2 : ఇక తగ్గేదేలే..’బాహుబలి-2′ రికార్డును బ్రేక్ చేసిన ‘పుష్ప-2’