CM Revanth : సింగపూర్ పర్యావరణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ భేటీ
CM Revanth : ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది
- By Sudheer Published Date - 03:56 PM, Sat - 18 January 25

సింగపూర్ పర్యటన (Singapore Tour)లో బిజీ గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం(Revanth Team)..రెండో రోజు ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్(Ms. Grace Fu Hai Yien)తో సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టులు, పెట్టుబడుల అవకాశాలను సింగపూర్ బృందానికి వివరించారు.
RG Kar Rape Case : డాక్టర్ హత్యాచార కేసు.. తీర్పు వెలువరించిన కోర్టు
ఈ సందర్భంగా తెలంగాణలో నెట్ జీరో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ముఖ్యంగా మూసీ నది నిర్వహణలో సింగపూర్ ప్రభుత్వం అందించే సాంకేతిక నిపుణత, అనుభవం కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా సింగపూర్ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు. సింగపూర్ ప్రభుత్వం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, ఉమ్మడి ప్రాజెక్టులపై పనిచేయడం ద్వారా పర్యావరణ సుస్థిరతకు దోహదం చేస్తుందని మంత్రి గ్రేస్ ఫూ హామీ ఇచ్చారు. మూసీ నది పునరుద్ధరణలో సింగపూర్ అనుసరించిన సమగ్ర విధానాలను తెలంగాణకు అందజేసి, అమలు చేయడంలో సహాయపడతామని తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణలో రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, అర్బన్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ అనుభవాన్ని తెలంగాణలో వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
మరోవైపు ఐటీ- పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అధికారులతో సహా ప్రతినిధి బృందం తెలంగాణలో పట్టణ ప్రణాళిక మరియు మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం మరియు సుస్థిరత వంటి అనేక రంగాలలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. సెమీ కండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరో అడుగు ముందుకేసింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి. ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (ఎస్ఎస్ఐఏ)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు.
Hon’ble Chief Minister Shri @revanth_anumula led the #TelanganaRising delegation to meet Ms. Grace Fu Hai Yien, Singapore Minister for Sustainability and Environment, and in-charge Minister, Trade. The two sides held wide-ranging discussions for partnership in several areas.… pic.twitter.com/ez1is5XjRz
— Telangana CMO (@TelanganaCMO) January 18, 2025