HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Allocated Rs 100 Crores For The Management Of Skill University

Young India Skill University : స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్

Young India Skill University : స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు

  • Author : Sudheer Date : 19-09-2024 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Seeks Industry Contribut
Cm Seeks Industry Contribut

Young India Skill University : తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు (Skill University In Telangana Board) తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు (Minister Bhatti , Sridhar Babu ), వర్సిటీ కో ఛైర్మన్ శ్రీని రాజు, సీఎస్ శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. యూనివర్సిటీ విధివిధానాలు, పరిశ్రమలతో అనుసంధానం చేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఇక స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో భేటీలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో సహకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా రేవంత్ విజన్ ఉన్న నాయకుడని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.

సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువతతో పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకలేదన్న రేవంత్‌ దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో స్కిల్‌ వర్సిటీ రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాని రేవంత్ గుర్తు చేసారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందన్న ఆయన వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్​ యూనివర్సిటీ నిర్వహిస్తున్నామని ఈ సందర్బంగా అన్నారు.

Read Also : TTD Laddu : తిరుమల లడ్డు తయారీ నుంచి నందిని నెయ్యిని ఎందుకు తొలగించారు.?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allocate RS.100 cr
  • cm revanth
  • Telangana Skill University
  • Young India Skill University

Related News

Cm Revanth Vs Aravind

CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సమగ్ర జీవిత బీమా మరియు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రధానంగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 'డిజిటల్ హెల్త్ కార్డులు' జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd