CM KCR: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఆ నియోజకవర్గ మొత్తానికి దళితబంధు!
తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరునంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
- By Balu J Published Date - 05:28 PM, Thu - 2 November 23

CM KCR: తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరునంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ధర్మపురి నియోజకవర్గం మొత్తం దళితబందు అమలు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. హుజురాబాద్ మాదిరిగా గా ధర్మపురి మొత్తం ఎస్సి లబ్ది దారులకు దళిత బందు ఇస్తామని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభ వేదిక పై నుంచి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా ధర్మపురి లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ధర్మపురి నియోజకవర్గం మొత్తం ఎస్సి లకు దళిత బందు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
హుజురాబాద్ నియోజకవర్గం లో అమలు చేసిన విధంగా ప్రతి ఎస్సి కుటుంబానికి దళిత బందు అమలు చేస్తామన్నారు. ఇక నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? నిర్మల్ జిల్లాను చేయించింది అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినే.. ప్రజల కోసం తండ్లాడే వ్యక్తి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు.
Also Read: Delhi CM: ఈడీకి షాక్ ఇచ్చిన కేజ్రీవాల్, విచారణకు డుమ్మా