HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Is Planning To Organize A Huge Rally From Hyderabad To Delhi

CM KCR : ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారో..ఓ క్లారిటీ వచ్చేసింది…!! సైలెంట్ గా భారీ స్కెచ్..!!

తెలంగాణ సీఎం కేసీఆర్..ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు.

  • Author : hashtagu Date : 15-10-2022 - 8:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్..ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలో రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన కేసీఆర్…ఇప్పుడు హస్తినవైపు మళ్లాడు. విజయదశమి రోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కేసీఆర్…బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. మూడు రోజుల క్రితం యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ అంత్యక్రియలకు వెళ్లిన కేసీఆర్…అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉండిపోయారు. ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారన్నది ఇప్పటివరకు ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీలోనే ఉండటం రాజకీయ వర్గాల్లో ఒక్కింత చర్చకు కారణమైంది. అయితే ఢిల్లీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తదుపరి కార్యచరణపై తన పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు మీడియా చెబుతోంది. కానీ అది నిజమా లేదా అన్నది క్లారిటీ మాత్రం మీడియా దగ్గర లేదు. ఇక స్థానిక మీడియా కేసీఆర్ ను పట్టించుకోవడమే మానేసింది.

మునుగోడు ఉపఎన్నికలో రాజకీయ పార్టీలతపాటు మీడియా కూడా ఫుల్ బిజీగా మారింది. బీఆర్ఎస్ గురించి మొదట్లో కవరేజ్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించిన మీడియా ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో జాతీయ మీడియా కూడా బీఆర్ఎస్ ను పక్కన పెట్టింది. కేసీఆర్ మూడు, నాలుగు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నా…ఆయన గురించి ఎలాంటి వార్తలు బయటకు పొక్కడం లేదు. దీంతో కేసీఆర్ వర్గీయులు ఆసక్తికర వార్తలను లీక్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కేసీఆర్ పెద్దెత్తున ఫ్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 9న న్యూఢిల్లీలో భారీ సభ నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. బీఆర్ఎస్ కు సంబంధించి సిద్ధాంతాలను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు భారీ వాహనాల ర్యాలీ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏయే మార్గాల ద్వారా వెళ్లాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేశారట. తర్వాత కొత్తగా విమానం కొనుగోలు చేసి దేశంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారామా లేక నిజంగానే కేసీఆర్ చేస్తారనేది వేచిచూడాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • hyderabad to delhi
  • kcr
  • political news
  • political updates

Related News

Psr Saval Kcr

Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు

    Latest News

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

    • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

    • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    Trending News

      • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd