AP : చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం – పవన్ కళ్యాణ్
జైల్లో ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని , మానవతా దృక్పథంతో వ్యవహించాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని
- By Sudheer Published Date - 01:48 PM, Sun - 15 October 23

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆరోగ్య పరిస్థితిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని , మానవతా దృక్పథంతో వ్యవహించాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అమానవీయంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆయన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. చంద్రబాబు వయస్సును దృష్టిలో ఉంచుకుని.. ఆయన ఆరోగ్య స్థితిగతులపై మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా లో, మీడియా ద్వారా ఆందోళన చెందితే.. ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు- ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. డాక్టర్స్ నివేదికలను పట్టించుకోకపోవడం, చంద్రబాబు విషయంలో ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ఇక ఇదిలా ఉంటె చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నేడు (ఆదివారం) రాత్రి 7 గంటల నుంచి 7:05 నిమిషాల మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బన్ కట్టుకొని నిరసన తెలపాలని టీడీపీ పిలుపునిచ్చింది. న్యాయానికి ‘ఇంకెన్నాళ్లీ సంకెళ్లు’ (TDP calls for Nyayaniki Sankellu) అని నినదించాలని కోరారు. ఆ వీడియోలు సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘న్యాయానికి సంకెళ్లు’ నిరసనలో పాల్గొన్న అనంతరం నారా లోకేశ్ సాయంత్రం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Read Also : McDonald’s: సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఫ్రీ ఫుడ్.. ఇప్పటికే 4 వేల భోజనాలు పంపిణీ..!