KCR Asifabad Tour: ఆసిఫాబాద్ లబ్దిదారులకు ‘పోడు’ భూమి పట్టాలను పంపిణీ చేయనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఆసిఫాబాద్‌లో పర్యటించనున్నారు. ఆసిఫాబాద్‌లోని లబ్ధిదారులకు పోడు భూముల పత్రాలను పంపిణీ
- By Praveen Aluthuru Published Date - 11:17 AM, Fri - 30 June 23

KCR Asifabad Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఆసిఫాబాద్‌లో పర్యటించనున్నారు. ఆసిఫాబాద్‌లోని లబ్ధిదారులకు పోడు భూముల పత్రాలను పంపిణీ చేయడంతోపాటు అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. అంచనా ప్రకారం 1.5 లక్షల మంది లబ్ధిదారులకు నాలుగు లక్షల ఎకరాల ‘పోడు’ భూమి పట్టాలను పంపిణీ చేయనున్నారు సీఎం కెసిఆర్.
ఈ పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ భవన సముదాయాన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని గోండు అమరవీరుడు, తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి, కోట్నాక్ భీమ్‌రావు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Read More: PM Modi: జూలై 8న తెలంగాణాలో ప్రధాని మోడీ పర్యటన