HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Got Ktr Phobia Mla Kp Vivekananda

Janwada Farm House : సీఎంకు కేటీఆర్ ఫోబియా పట్టుకుంది – ఎమ్మెల్యే కేపీ వివేకానంద

Janwada Farm House : కేటీఆర్ పట్ల ఉన్న ప్రజాదరణను జీర్ణించుకోలేకపోతున్నందున, కేటీఆర్‌ను రాజకీయంగా అప్రతిష్ఠపాల్జేసేందుకు ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం చేస్తున్నారని విమర్శించారు.

  • Author : Sudheer Date : 27-10-2024 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mla Viveka
Mla Viveka

జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన ఫ్యామిలీ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ అనవరంగా రాద్ధాంతం చేస్తుందని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ పట్ల ఫోబియా పట్టుకుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కేటీఆర్ పట్ల ఉన్న ప్రజాదరణను జీర్ణించుకోలేకపోతున్నందున, కేటీఆర్‌ను రాజకీయంగా అప్రతిష్ఠపాల్జేసేందుకు ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం చేస్తున్నారని విమర్శించారు.

ఫాంహౌస్‌పై తనిఖీలు జరపడం, కేటీఆర్ కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేయడంపై సీరియస్‌గా స్పందిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి అసూయతో ఈ చర్యలకు దిగుతున్నారని కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలమైన నేతలలో ఒకరిగా కేటీఆర్ ప్రసిద్ధి చెందారు. ఆయనకు ఉన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి కుట్రల వైపు పోతున్నారని కేపీ వివేకానంద అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను అప్రతిష్టపరచడానికి, వివిధ ఆరోపణలు చేస్తున్నారని, అయితే అవి నిరాధారమైనవని ఆయన అన్నారు. కేటీఆర్ తన కుటుంబానికి, రాజకీయ జీవితానికి కచ్చితమైన విధానాలను అనుసరిస్తున్నారని వివేకానంద వ్యాఖ్యానించారు.

ఫాంహౌస్‌పై దాడులు ,అక్రమ తనిఖీలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న చర్యలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవుతున్నారని, ప్రజలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా ఏదో ఒక కేసులో అక్రమంగా ఇరికించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్‌ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్లి వెళ్లి సెర్చ్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు విని వారి చేతిలో కీలు బొమ్మలాగా మారుతున్నారు. ఇది సరికాదన్నారు.

Read Also : Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • juvvada farm house party
  • ktr
  • mla viveka

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd