Bhatti: రామన్నగూడెం రైతులకు భరోసా ఇచ్చిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..?
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ అత్యంత దారుణంగా విఫలమైనందున పోడు రైతుల సమస్యల
- By Anshu Published Date - 08:13 PM, Sat - 16 July 22

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ అత్యంత దారుణంగా విఫలమైనందున పోడు రైతుల సమస్యల పరిష్కారం కొరకు పోరాటమే శరణ్యమన్నారు. పోడు రైతుల సమస్యలు, పోలీస్, ఆటవి శాఖ అధికారుల వేదింపులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టకి తీసుకువెళ్లడానికి లేఖ రాస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కారించాలని ఆగ్రామ రైతులు చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడిని పోలీసులు అడ్డకున్న విషయం విధితమే.
అప్పటి నుంచి కక్షపూరితంగా పోలీసులు, అటవి శాఖ అధికారులు పోడు వ్యవసాయం చేయకుండ రైతులను అడ్డుకుంటూ వేదింపులకు పాలడుతున్న విషయం తెలుసుకున్న భట్టి విక్రమార్క బాధిత రైతులకు భరోసా ఇవ్వడానికి “నేను ఉన్నాను.. నేను వస్తాను”. అని రామన్నగూడెం వెళ్లి రైతులను పరమార్శించి వారికి మనోధైర్యం కల్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భూమికి మనిషికి ఉన్న అనుబంధం విడదీయరానిది అని అన్నారు. పేదల నుంచి భూములు బలవంతంగా గుంజుకోవడం వారి ప్రాణం లాకున్నట్టేనని అన్నారు. ముఖ్యంగా గిరిజన,ఆదివాసులకు భూమితో ఉన్న అనుబంధం పువ్వులో.. పువ్వునై, ఆకులో ఆకునై అని ఉన్నట్టుగా ఉంటుందని దీనిని తాను నమ్ముతానని తెలిపారు.
భూములతో విడదీయని అనుబంధం ఉన్న మీ నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడం దారుణమన్నారు. మహిళలు, పిల్లలు అని చూడకుండా పోలీసులు, అటవి అధికారులు పోడు వ్యవసాయం చేసుకోకుండ అడ్డుపడటంతో పాటు హద్దులు మీరుతూ మహిళలు, పిల్లలు అని చూడకుండ అత్యంత పాశవికంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల ప్రకారం గిరిజన, ఆదివాసీల హక్కుల సాధనకై కలిసి పోరాటం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. “ఈ భూమి మనది, ఈ నీళ్ళు మనవి, వీటి మీద హక్కులు మనవని, వీటిని హరించే హక్కు ఎవరికి లేదని” అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం పోడు భూముల వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చేంత వరకు బాధితుల తరుపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
రామన్నగూడెం రైతుల కు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తాను
రామన్నగూడెంలో 1918 సంవత్సరం నుంచి రైతులు తమ పట్టాభూముల్లో సాగు చేసుకుంటున్నారు. నాడు అటవీశాఖ అధికారులు టేకు, ఎదురు పండించమని చెప్పి రైతులతో బలవంతంగా వాటిని సాగు చేయించి అటవి భూములంటూ రైతుల నుంచి బలవంతంగా గుంజుకోవడం తగదన్నారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం పోడు భూములుగా మార్చడం దారుణమన్నారు. రైతులు తమ భూముల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడానికే నేను వచ్చానని తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల ఒక్క రామన్నగూడెంలోనే వేల ఎకరాలు రైతులకు దూరం అవుతుంటే.. రాష్ట్రంలో లక్షల ఎకరాల భూముల నమోదులో తప్పులు ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. రామన్నగూడెం గిరిజన, ఆదివాసీలకు జరుగుతున్న ఆన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. రాజ్యంగ సంస్థలకు, ఉన్నతాధికారులకు లేఖ రాస్తాను. మీతో కలిసి మీకు అండగా ఉంటూ మీరు చేసే పోరాటంలో ముందుంటానని వారికి భరోసా ఇచ్చారు.
అటవి భూములు కావు.. రైతులకు ఇవ్వండి
కాంగ్రెస్ హాయంలో ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూములు రైతులవన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ ప్రభుత్వం ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అటకేకించిందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న భూములు అటవీ శాఖకు సంబంధించినవి కావని, రైతుల పట్టాభూములని గతంలోనే సర్కార్ చెప్పాను. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములను రైతులకు ఇవ్వలేదు. రైతులకు వెంటనే భూములు అప్పగించాలి. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
3లక్షల ఎకరాకుల పట్టాలిచ్చాం
యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధి ఆధ్వర్యలో పోడు రైతులకు పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భద్రచలంలో ఒకే రోజు 3 లక్షల ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కార్యక్రమానికి తానే సజీవ సాక్షమన్నారు.