Smart Phone: విషాదం.. స్మార్ట్ ఫోన్ ఇవ్వనందుకు తొమ్మిదో తరగతి బాలుడు ఆత్మహత్య!
తల్లి స్మార్ట్ ఫోన్ ఇవ్వనందుకు తొమ్మిదో తరగతి చదివే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు.
- By Balu J Published Date - 12:46 PM, Wed - 16 August 23

చిన్న పిల్లలు సైతం స్మార్ట్ వాడకం పట్ల ఇష్టం పెంచుకుంటున్నారు. మితిమీరిన ఫోన్ వాడకం వద్దని తల్లిదండ్రులు మందలిస్తే నిమిషాల్లో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో 13 ఏళ్ల బాలుడికి తల్లి స్మార్ట్‌ఫోన్ ఇవ్వకపోవడంతో ప్రాణాలు విడిచాడు. మాయద నరేష్, జ్వాల దంపతుల కుమారుడు సాయి చరణ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
చిన వయసులోనే స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యాడు. మంగళవారం ఉదయం కాలుకు గాయం కావడంతో పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. అయితే చాలా సేపు స్మార్ట్‌ఫోన్‌లో ఆడుకోవడం చూసిన తల్లి మందలించి కొడుకు నుంచి ఫోన్ తీసుకుంది. దీంతో మనస్తాపం చెందిన నరేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Also Read: 4 Killed: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి, ఆరుగురికి గాయాలు!