CI Harassment : పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై CI లైంగిక వేధింపులు
సీఐ పురేందర్ రెడ్డి సదరు మహిళతో అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలి అంటూ మేసెజ్‌లు చేశాడు
- By Sudheer Published Date - 05:01 PM, Sat - 20 July 24

దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిరోడ్డుపై నడిచినప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మన జాతిపిత మహాత్మాగాంధీ చెప్పారు. కానీ ఇప్పుడు అర్ధరాత్రి కాదు మిట్ట మధ్యాహ్నం కూడా ఆడపిల్ల ఒంటరిగా నడిచే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ కోరిక తీర్చుకోవడానికి ఎంత దారుణానికైనా తెగపడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి దగ్గరి నుండి మంచనపడ్డ ముసలి అవ్వ ని వరకు ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. ఇలాంటి దారుణాలను అరికట్టాల్సిన రక్షకభటులు సైతం కామంధులుగా మారిపోతూ సభ్యసమాజం ఫై గౌరవం లేకుండా చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా, న్యాయం కోసం వచ్చిన ఓ బాధితురాలని సనత్ నగర్ సీఐ లైంగికంగా వేధించిన ఘటన సంచలనంగా మారింది. సీఐ పురేందర్ రెడ్డి సదరు మహిళతో అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలి అంటూ మేసెజ్‌లు చేశాడు. సీఐ వేధింపులు ఎక్కువవుతుండటంతో బాధిత మహిళ సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది. సీఐ తనతో చేసిన అసభ్య చాటింగ్‌ను సీపీకి బాధితురాలు చూయించింది. దీంతో సీఐ పురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ప్రస్తుతం మీడియా లో , సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండడం తో మహిళలు , మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Rains : తెలంగాణలో ఇంకో రెండు రోజులు వర్షాలే..వర్షాలు