Kedar Selagamsetty Died : హరీష్ రావు పై కీలక అనుమానాలు వ్యక్తం చేసిన చామల కిరణ్
Kedar Selagamsetty Died : ప్రముఖ తెలుగు సినీ నిర్మాత కేదార్ శెలగంశెట్టి అనుమానాస్పదంగా దుబాయ్‌లో మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్‌రావుకు శవరాజకీయాలు కొత్త కాదంటూ ఆరోపించారు
- Author : Sudheer
Date : 03-03-2025 - 8:08 IST
Published By : Hashtagu Telugu Desk
SLBC టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉండగా, బాధిత కుటుంబాలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు దుబాయ్‌లో విందుల మద్య మునిగి తేలుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో హరీష్ రావు దుబాయ్ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
Prakash Raj Vs PM Modi: మణిపూర్‌కూ ఓసారి వెళ్లండి.. మోడీ గిర్ టూర్‌పై ప్రకాశ్‌రాజ్ ట్వీట్
ఈ నేపథ్యంలో హరీష్ రావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాత కేదార్ శెలగంశెట్టి అనుమానాస్పదంగా దుబాయ్‌లో మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్‌రావుకు శవరాజకీయాలు కొత్త కాదంటూ ఆరోపించారు. కేదార్ మరణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Fact Check : రంజాన్ మాసం వేళ.. పుచ్చకాయల్లోకి రసాయనాలు.. వీడియో వైరల్
ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టే హరీశ్‌రావు.. దుబాయ్ పర్యటన వివరాలు మాత్రం ఎందుకు పెట్టలేదని కిరణ్ కుమార్ ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురి వివాహం 6వ తేదీన ఉంటే.. 22వ తేదీన ఎందుకు పోయినట్టని హరీష్ రావును ప్రశ్నించారు. నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకునేందుకే రాజకీయ నాయకులు దుబాయ్ వెళ్తారని కిరణ్ పేర్కొన్నారు. తెలంగాణలో లూటీ చేసిన పైసలు దాచుకోవడానికే హరీశ్‌రావు దుబాయ్ వెళ్లారని ఆరోపించారు. మరి ఈ ఆరోపణలకు హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.