Kazipet Rail Coach Factory : తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
Kazipet Rail Coach Factory : కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రకటన కోసం తెలంగాణ ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు
- By Sudheer Published Date - 10:16 PM, Thu - 28 November 24

తెలంగాణ ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి..ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మంచి రోజులు రాబోతున్నాయి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(Kazipet Rail Coach Factory)ని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ (Department of Railways) తెలిపింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రకటన కోసం తెలంగాణ ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు ఈ విషయంలో దాటవేస్తూ ఉండడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించడానికి దోహదపడుతుంది.
ప్రస్తుత కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్ షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా అధునాతన రైలు కోచ్‌ల తయారీకి మార్గం సుగమం అవుతుంది. ఎల్‌హెచ్‌బీ (లింక్ హోఫ్మన్ బుష్) మరియు ఈఎంయూ (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్‌లను తయారు చేయడం రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన హామీలలో ఒకటి. దీనిని తక్షణం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని రైల్వే శాఖ తెలిపింది. కొత్త కోచ్‌ల తయారీ ద్వారా స్థానికులకు వేలకొద్దీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్ సమీప ప్రాంతాల్లో మౌలిక వసతులు, సహాయ పరిశ్రమలు అభివృద్ధికి దోహదం చేస్తుంది. అధునాతన కోచ్‌ల తయారీతో రైలు ప్రయాణ నాణ్యత మెరుగవుతుంది.ఈ ఫ్యాక్టరీ ప్రారంభం కావడం వల్ల తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల వికాసంలో కీలక ఘట్టాన్ని చేరుకుంటుంది. దీని ద్వారా దక్షిణ మధ్య రైల్వే లో మరింత ఆధునికీకరణకు దారి ఏర్పడుతుంది.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మరియు నిర్మాణ ప్రగతి త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also : Black Friday Sale In India: విమానంలో ప్రయాణించే వారికి శుభవార్త.. రూ. 50 లక్షల ఉచిత ప్రయాణ బీమా!